అలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయి!

‘ఫిదా’ లో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను .. ఆ సన్నివేశానికి అది అవసరం. ఆ సినిమాలో అలా వేసుకున్నానని అలా మరో సినిమాలో కనిపించడం కుదరదు. అలా చేయాలని ఒత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకుంటా. అలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయంది సాయి పల్లవి. సాయి పల్లవి మీడియాతో ఇటీవల మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది….
ఒక వేళా నటి కాకుంటే ఏం చేసుండే వారని అడిగితే.. సాయి పల్లవి స్పందిస్తూ.. ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజిస్ట్ అయ్యేదాన్నని తెలిపింది. ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా… మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష కు లిపి లేదని సమాదానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా..’ఎన్.జి.కె’ సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు ‘సినిమాలను వదిలేస్తా’నని అమ్మకు చెప్పి ఏడ్చేశాను అని చెప్పింది.
“మొదటి నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతాను. కురచగా ఉండే బట్టలు వేసుకోవడం.. లేదా మోతాదుకు మించిన అందాలు ఒలకబోయడం నాకు ఇష్టం ఉండదు. అది నావల్ల కాదని చెప్పింది. ‘ఫిదా’ సినిమాలో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను .. ఆ సన్నివేశానికి అది అవసరం. ఆ సినిమాలో అలా వేసుకున్నానని అలా మరో సినిమాలో కనిపించడం కుదరదు. అలా చేయాలనీ ఒత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకుంటా. ఇలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయంది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె తాజాగా మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌కు జోడిగా మహా సముద్రంలో నటించనుందని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.
అసలు పెళ్లి చేసుకుంటానో లేదో !
సాయి పల్లవి పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. కాలేజీ రోజుల్లో ఆమె లవ్‌ ఫెయిల్యూర్‌ కారణంగా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించు కుందని సోషల్‌ మీడియాలో ఓ వార్త అప్పట్లో వచ్చింది. తాజాగా సాయి పల్లవి సినిమాలకు దూరం కానుందనే కథనాలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఫిదా బ్యూటీ ఫైనల్ గా తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు…”త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరమవడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను” అని సాయిపల్లవి తేల్చి చెప్పింది .
 
నటనతో కన్నీళ్లు పెట్టిస్తుందట!
సాయి పల్లవి ‘విరాట పర్వం’లో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సాయి పల్లవి లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి ఎరుపు రంగు డ్రెస్‌లో అమరవీరుల స్థూపం దగ్గర ఓ సాధారణ అమ్మాయిలా కూర్చోని ఉంది. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్‌గాను, సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపించనున్నది అనేది సమాచారం. సాయిపల్లవి ఎందుకు నక్సలైట్ గా మారవలసి వచ్చింది? నక్సలైట్ గా మారిన ఆమె చివరికి సాధించినది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు.అయితే అనుకున్నది సాధించే క్రమంలో ఆమె తన ప్రాణాలను కూడా కోల్పోతుందట. ఆ సన్నివేశంలో సాయి పల్లవి నటనతోకన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. సినిమా అంతటికి ఆ సన్నివేశం హైలైట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో రానా పాత్ర ‘మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే’ ఈ విరాట పర్వం. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో సామాజిక పరిస్థితుల నేపధ్యంలో ఉంటుంది. అందులో అప్పటి దళారీ వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారట.