ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ

‘విరాట పర్వం’ అనే సినిమాను సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో చేస్తోంది. ఈ సినిమాకు ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా..రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. ఇందులో పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు రానా. సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపిస్తుంది ..అని సమాచారం. గాయకురాలిగా ఉండి, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య నక్సల్‌ ఉద్యమంలో చేరే ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. తుపాకీతో ఎలా కాల్చాలి? బాంబులు ఎలా వేయాలి? అని ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట సాయి పల్లవి. నక్సలైట్ల బాడీ లాంగ్వేజ్, వేషధారణ, కూంబింగ్‌ ఆపరేషన్స్‌ వంటి విషయాల్లో అవగాహన కోసం ఓ మాజీ నక్సలైట్‌ దగ్గర శిక్షణ తీసుకుంతోందట సాయి పల్లవి. ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌ కీలక పాత్రధారులు. చిత్రీకరణను ఎక్కువ భాగం వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ప్లాన్‌ చేశారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
సాయిపల్లవి డిజిటల్‌ ఎంట్రీ
సాయిపల్లవి డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ‘లస్ట్‌స్టోరీస్‌’ ఆంథాలజీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’. ఆ ‘లస్ట్‌స్టోరీస్‌’తోనే టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ ఆంథాలజీతో అడుగుపెట్టనుంది. నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిపి ఓ చిత్రంగా మలచడమే ఆంథాలజీ. ఈ తమిళ ఆంథాలజీ పరువు హత్యలు ఆధారంగా ఉంటాయని తెలిసింది. తమిళ దర్శకులు గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్, వెట్రిమారన్‌ ఈ ఆంథాలజీని తెరకెక్కిస్తారట. అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేశ్‌ శివన్‌ తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేశారట. వెట్రిమారన్‌ రూపొందించే భాగంలో సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు . కాగా సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ తండ్రీకూతుళ్లుగా నటించనున్న ఈ ఆంథాలజీ డిసెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.
 
సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.