డబ్బై మూడు సీన్స్ తీసెయ్యమన్నారు !

సినిమాలో తీవ్రమైన హింసను, రక్తపాతాలను చూపించినా,అశ్లీల దృశ్యాలు,పదజాలాలు వాడిన నిర్ధాక్షిణ్యంగా ఆ సీన్స్ కి సెన్సార్ బోర్డు కోత పెడుతుంద‌న్న సంగతి తెలిసిందే.బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’. అక్షత్‌ వర్మ దర్శకుడు.ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సైఫ్‌ ఎప్పుడూ చూడని ఓ కొత్త గెటప్‌లో కనిపించాడు.

అయితే ఈ సినిమాలో 73 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించింది. సినిమాలో మరీ ఎక్కువగా అసభ్య పదాలు ఉన్నాయని, ఎవరూ అలాంటి పదాలు విని ఉండరని సీబీఎఫ్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు సీబీఎఫ్‌సీ ఏ సినిమాకూ ఇన్ని కత్తిరింపులు ఇవ్వలేదు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించిన ‘బాబూమోషాయ్‌ బందూక్‌బాజ్‌’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు 48 కత్తిరింపులు విధించింది.

48 క‌ట్స్  8 కి త‌గ్గాయి !

న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘బాబూ‌మోషాయ్ బందూక్ బాజ్’ లో అభ్యంతకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయ‌ని సెన్సార్ బోర్డ్ చైర్మ‌న్ పంక‌జ్ నిహ్ల‌నీ ఏకంగా 48 చోట్ల సీన్లు కట్ చేయాలని ఆదేశించారు. దీంతో షాకైన చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం. ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ మూవీ కుషన్ నందీ దర్శకత్వం లో తెర‌కెక్క‌గా ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా , అతడికి జోడీగా బెంగాలీ నటి బిదితా బాగ్‌ నటించింది. సినిమాలో తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్న విష‌యం విదిత‌మే.