మహిళా ప్రాధాన్య చిత్రంలో పాపకి తల్లిగా …..

‘ప్రేమమ్‌’తో మలయాళ ప్రేక్షకుల్ని, ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చేసిన మాలీవుడ్‌ తార సాయిపల్లవి కోలీవుడ్‌ ఆరంగేట్రం ఖరారైంది. మణిరత్నం ‘కాట్రు వెలియిడై’, విక్రమ్‌ ‘స్కెచ్‌’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని చేజార్చుకున్న సాయిపల్లవి… వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చెప్పిన మహిళా   ప్రాధాన్య కథకు ఫిదా అయిపోయింది. తను తీసే ప్రతి సినిమాలోనూ సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండాలని కోరుకునే విజయ్‌… దశాబ్దాలుగా భారతీయ సమాజంలో స్త్రీ ల  ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉన్న అబార్షన్ల నేపథ్యంతో తన కొత్త ప్రాజెక్టు ‘కణం’ (‘కరు’)ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసి, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.
 ఇందులో సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా నటించడం ఆసక్తికరమైన విషయం. మలయాళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా యువతను మెస్మరైజ్‌ చేస్తున్న దశలోనే తల్లిపాత్రలో నటించడం సాహసమే. అయితే కథాబలంతో కూడిన  ‘కణం’కు ఆమె ఫిదా అయిపోయింది. తల్లి, నాలుగేళ్ల కూతురు మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇక ‘ఫిదా’లో సొంతంగా డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి.. తమిళంలోను తనే సొంతంగా డబ్బింగ్‌ చెబుతుండడం విశేషం.ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేస్తోంది. ‘2.0’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.
నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.