సల్మాన్ కి కరీనా లాంటి వరీనా దొరికింది !

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ రీసెంట్ గా తన ట్విట్టర్ లో ‘ముజే లడఖీ మిల్ గయే’ ( నాకు అమ్మాయి దొరికింది) అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సల్మాన్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొద్ది రోజులుగా సల్మాన్ తో పాటు ఆయన ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్న లులియా వాంటర్ కాకుండా సల్మాన్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడా? అని జోరుగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్… “తనకి దొరికిన అమ్మాయి సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ లో రూపొందబోయే ‘లవ్ రాత్రి’ సినిమా కథానాయిక వరీనా”(Nothing to worry na ki film ke liye ladki mil gayi Warina, Toh dont worry na be happy na) అని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్. అచ్చం ఈ అమ్మాయి కరీనా కపూర్ లా ఉండటం…ఆమెకు కరీనా ను గుర్తు తెచ్చేలా వరీనా అని పేరు పెట్టడం విశేషం.  ఇంతకు ముందు ఐశ్వర్యా రాయ్ పోలికలున్న స్నేహ ఉల్లాల్ ని పరిచయం చేసిన సల్మాన్ ఇప్పుడు ఈమెను తెరకేక్కిస్తున్నాడు . ఆయుశ్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘లవ్ రాత్రి’ చిత్రం అభిరాజ్ మినవాల్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇక ఇటీవల ‘టైగర్ జిందాహై’ సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం ‘రేస్ 3’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.