అందులోనూ ఆ జంటదే రికార్డ్ !

సల్మాన్ ఖాన్, కత్రినా జంటగా నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. మన దేశంలోనే కాక విదేశాల్లోనూ హైయస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలచింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా మరో రూపంలోనూ వార్తల్లోకెక్కింది.సల్మాన్ ఖాన్, కత్రినా జంట మరో భారీ హిట్ కొట్టేసింది. కాకపోతే.. ఇది సిల్వర్ స్క్రీన్‌పై కాదండోయ్.. వేరొక చోట. ఈ సినిమాలోని ‘‘స్వాగ్ సే స్వాగత్’’ అనే పాట 500 మిలియన్ వ్యూస్‌ను అందుకుని యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
 ‘యూట్యూబ్’ లో ఓ పాటకు 500 మిలియన్ వ్యూస్ రావడం సాదాసీదా విషయమేం కాదు. మన దేశంలోనే ఈ స్థాయి వ్యూస్ అందుకున్న పాట మరొకటి లేదు. దీంతో 500 మిలియన్ వ్యూస్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ సాంగ్‌గా ‘‘స్వాగ్ సే స్వాగత్’’ యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. వంద మంది డ్యాన్సర్స్ నడుమ చిత్రీకరించిన ఈ పాటకు మెయిన్ హైలెట్.. సల్మాన్, కత్రినా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే. ఇదే.. ఈ పాటకు ఇన్నేసి వ్యూస్ రావడానికి కారణమంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి బాక్సాపీస్ రికార్డులే కాదు.. యూట్యూబ్ రికార్డులు కూడా కొల్లగొట్టారు ఈ జంట