డబ్బై ఐదేళ్ళ వృద్దుడిగా ప్రయోగం !

మరోసారి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలోనే సల్మాన్‌ ఖాన్‌ ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇటీవల సల్మాన్‌ ఖాన్‌, కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ట్యూబ్‌లైట్‌’ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఏ హీరో అయినా ఫెయిల్యూర్‌ ఇచ్చిన దర్శకుడితో నటించేందుకు ఆసక్తి చూపరు. కానీ సల్మాన్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలోఈ ప్రయోగాత్మక చిత్రంలో 75 ఏండ్ల వృద్ధుడిగా సల్మాన్‌ కనిపిస్తాడని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంలో షారూఖ్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంటే, ఆనంద్‌ ఎల్‌.రాయ్ దర్శకత్వంలో షారూఖ్‌ నటించే చిత్రంలో అతిథి పాత్రలో సల్మాన్‌ నటించబోతున్నారు. షారూఖ్‌ ప్రస్తుతం ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క శర్మ హీరోయిన్‌.