‘బిగ్‌బాస్’ 11వ సీజన్ లో ఎపిసోడ్‌ కు 11 కోట్లు !

హిందీ ‘బిగ్‌బాస్‌’కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ప్రతి సీజన్‌కు రికార్డు టీఆర్పీలతో ఈ రియాల్టీ షో దూసుకెళ్తున్నది. అందుకు తగినట్లే ఈ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ తన రెమ్యునరేషన్‌ను పెంచేస్తున్నాడు. తాజాగా అక్టోబర్ 1 నుంచి బిగ్‌బాస్ 11వ సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఎనిమిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. దీనికోసం సల్మాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.11 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా ఓ రికార్డే.

సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు. తన తొలి సీజన్‌లో సల్మాన్ ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. బిగ్‌బాస్ 7లో ఆ మొత్తాన్ని ఏకంగా రెట్టింపు చేసి ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు అందుకున్నాడు. ఇక సీజన్ 8లో రూ.5.5 కోట్లు, సీజన్ 9లో రూ.7 నుంచి 8 కోట్లు సల్మాన్ తీసుకున్నాడు. గతేడాది పదో సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.8 కోట్లు అందుకున్న సల్మాన్.. ఈసారి దానిని ఏకంగా రూ.11 కోట్లకు పెంచడం విశేషం.