కచ్చితంగా ఈసారి వీరి పెళ్లి తప్పదు !

బాలీవుడ్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్‌ఖాన్‌, స్టార్ హీరోయిన్ క‌త్రినాకైఫ్‌ల ప్రేమ వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. క‌త్రిన బాలీవుడ్‌లో నిలదొక్కుకోవ‌డానికి స‌ల్మానే కార‌ణం అనే విషయం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత వారి మ‌ధ్య దూరం పెరిగింది. క‌త్రిన.. ర‌ణ్‌బీర్‌కు ద‌గ్గ‌రైంది. అత‌నితో చాలా ఏళ్లు ప్రేమాయ‌ణం సాగించింది. వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స‌యింది అనే వార్త‌లొచ్చాయి. అలాంటి స‌మ‌యంలో వారిద్ద‌రూ కూడా విడిపోయారు.
దీంతో క‌త్రిన మ‌ళ్లీ స‌ల్మాన్‌కు చేరువైంది. కృష్ణ‌జింక‌లను వేటాడిన కేసులో స‌ల్మాన్ జైలుపాలైతే క‌త్రిన అతని కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేసింది. అంతేకాదు స‌ల్మాన్ జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత‌.. రెండ్రోజుల పాటు అత‌ని ఇంట్లోనే ఉండి స‌ప‌ర్య‌లు చేసింద‌ట‌. ఇక‌పై స‌ల్మాన్ అంగీకారంతోనే సినిమాలు చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో వీరు చాలా ద‌గ్గ‌ర‌య్యార‌ని, ఈసారి కచ్చితంగా పెళ్లి చేసుకుంటార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది

 

‘కపుల్‌ గోల్స్‌’ అంటూ పేరు కూడా పెట్టారు !

బ్రేకప్‌ అవ్వొచ్చు.. పరిస్థితులు దూరం చేయొచ్చు.. కానీ, ఒకసారి ప్రేమించుకున్నవారు తిరిగి ఎప్పుడైనా ఎదురుపడినా, పక్కపక్కనే ఉన్నా తామిద్దరం ఎప్పటికీ ఒకటే అని కొంతమంది నిరూపించుకుంటుంటారు. అలాంటి వాళ్లల్లో ప్రముఖంగా బాలీవుడ్‌ నటుడు, ఇండస్ట్రీ మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆయన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ను చెప్పుకోవచ్చు. వారిద్దరు ఎప్పుడో విడిపోయారని చెప్పుకున్నప్పటికీ పలు సందర్భాల్లో వారి మధ్య అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఎన్నో సార్లు మీడియాకు చిక్కి చర్చల్లో నిలిచారు.

సరిగ్గా చాలా రోజుల తర్వాత మరోసారి దొరికిపోయారు. అది కూడా ఏకంగా ఒకే కప్పులో కాఫీని ఇద్దరు తాగేస్తూ. అవును.. దబాంగ్‌ చిత్రం కోసం ప్రత్యేక టూర్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా పుణెలో ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఆ సమయంలో ఫ్యాన్స్‌కు మాత్రం కళ్లన్నీ సల్మాన్‌, కత్రినాలపైనే పడ్డాయి. వారు ఏం చేస్తారా అని ఆసక్తిగా ప్రతి మూమెంట్‌ గమనిస్తున్నారు. అదే సమయంలో ఒకే కాఫీ కప్పును ఇద్దరు షేర్‌ చేసుకోవడం చూశారు. సల్మాన్‌ కొంచెం తాగి ఇచ్చిన కాఫీ కప్‌ను తీసుకుని కత్రినా తాగేసింది. దాంతో ఖంగుతిన్న ఫ్యాన్స్‌ వెంటనే ఆ సీన్‌ను తమ ఫోన్‌లలో వీడియో తీసి ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నారు. అంతటితో ఆగకుండా దానికి కపుల్‌ గోల్స్‌ అంటూ పేరు కూడా పెట్టారు. ఇదిప్పుడు పెద్దగా వైరల్‌ అవుతోంది.