ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నా !

 స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌. ఐశ్వ‌ర్యారాయ్‌, సంగీత బిజిలానీ, క‌త్రినా కైఫ్ వంటి హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాల‌ను సాగించిన‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టికి పెళ్లి విషయంలో మాత్రం స‌ల్మాన్‌కు ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు.ఎప్ప‌ట్నుంచో ‘బాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్’ జాబితాలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు
నిజానికి గ‌తంలోనే తాను ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నాన‌ని, అయితే వాళ్ల నాన్న అందుకు ఒప్పుకోలేద‌ని స‌ల్మాన్  ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. 1992లో స‌ల్మాన్ ఇచ్చిన ఆ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది…..
`గ‌తంలో ఆమిర్, నేను క‌లిసి `అందాజ్ ఆప్నా ఆప్నా` సినిమాలో న‌టించాం. ఆ స‌మ‌యంలో ఆమిర్ ఎప్పుడూ త‌న భార్య గురించే చెబుతూ ఉండేవాడు. దాంతో నాకు ఓ కుటుంబం ఉంటే బాగుంటుంద‌ని, పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాను. జుహీ చావ్లాను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాను. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్న అంగీక‌రించ‌లేదు. అల్లుడిగా నేను త‌న‌కు స‌రిపోన‌ని అనుకున్నారు. అస‌లు, ఆయ‌న‌కు ఏమి కావాలో నాకు అర్థం కాలేద‌`ని స‌ల్మాన్ ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. పెళ్లి విషయంలో రాబోయే రోజుల్లో  స‌ల్మాన్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ….