పెళ్లి ఖర్చుకు నా దగ్గర అంత డబ్బు లేదు బాబోయ్ !

సల్మాన్ ఖాన్ 52సంవత్సరాల వయసు పైబడినా ఇంకా పెళ్లి చేసుకోలేదు . డబ్బు, హోదా, అందం అన్నీ ఉన్నప్పటికీ ఈయన పెళ్ళెందుకు చేసుకోలేదనేది సినీ లోకానికి ఓ చిక్కుముడి లాంటి ప్రశ్న. సల్మాన్ పెళ్లి విషయంలో ఆయన తండ్రి సలీం ఖాన్ కూడా ‘సల్మాన్‌ పెళ్లి గురించి నన్ను అడగొద్దు. అతన్నే అడగండి’ అంటూ చేతులెత్తేశారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే సల్మాన్ నుండి మాత్రమే రావాలి తప్ప వేరే మార్గం లేదు.
 అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై స్పందించిన సల్మాన్… యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన నోటివెంట వచ్చిన ఆ మాట విని ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు అక్కడున్నవారంతా. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..‘పెళ్లంటే బోలెడు ఖర్చు. అంత డబ్బు నా దగ్గర లేదు బాబోయ్.. అయినా ఆ రోజుల్లో మా నాన్నగారు కేవలం 180 రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు’ అంటూ మాట్లాడటంతో ఆశ్చర్యపోయారు అంతా. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒకరైన సల్మాన్ ఇలా మాట్లాడుతున్నాడంటే ‘ఇక ఆయన పెళ్లి చేసుకోరు’ అనే భావనకు వచ్చేశారు బీ టౌన్ ప్రేక్షకులు.

 

నాకు పెళ్లి అయితే మీకేం లాభం ? 

 ‘ప్రేమకు సై.. పెళ్లికి నై’ అన్నది సల్మాన్‌ ఖాన్‌ సిద్ధాంతం అని జోక్‌లేస్తారు. మరి.. సల్మాన్‌ లవర్స్‌ లిస్ట్‌ తక్కువేం కాదు కదా! సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, ప్రస్తుతం లూలియా వంతూర్‌… ఇలా చాలా మందితో ఈయనగారు ప్రేమాయణం సాగించారు. బట్‌.. పెళ్లి? ఊహూ! మూడు ముళ్లు వేసేదాకా ఏ ప్రేమనూ కొనసాగించలేదు. అందుకే సల్మాన్‌ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగకుండా ఉండరు. తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఆ మధ్య ఫాన్స్, ప్రెస్ సమక్షం లో ఈ కండలవీరుడికి ఎదురైంది.

మెజారిటీ ఫ్యాన్స్‌ సల్లూభాయ్‌ పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇందుకు సల్మాన్‌ స్పందిస్తూ– ‘‘నా పెళ్లి గురించి మీరందరూ ఆలోచిస్తుండటం సంతోషంగా ఉంది. పెళ్లి టైమ్‌ వస్తే అయిపోతుంది. లేకుంటే లేదు. పెళ్లి గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. నాకు పెళ్లి అయితే మీకేం లాభమో నాకర్థం కావడం లేదు. అయినా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా’’ అంటూ ఎప్పటిలానే పెళ్లెప్పుడో చెప్పకుండా దాటేశారు.