డిస్ట్రిబ్యూటర్లకు నష్ట పరిహారం ఇచ్చేస్తాడట !

రంజాన్‌కు విడుదలైన సల్మాన్ ఖాన్‌ “ఏక్‌ థా టైగర్‌”, “బజరంగీ భాయ్‌జాన్‌”, “సుల్తాన్‌” ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇదే ఏడాది రంజాన్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ట్యూబ్ లైట్”  ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన  “ట్యూబ్ లైట్”  బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.  దీంతో కనీసస్థాయిలో కూడా కలెక్షన్లు వసూలు కాలేదు. తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కలిగించాలని సల్మాన్‌ నిర్ణయించినట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

సల్మాన్ ఖాన్‌ తన సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రూ. 55 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయినట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు వరకు చెల్లించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. “ట్యూబ్ లైట్”  నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి సినిమా ‘టైగర్ జిందాహై’ పై పడింది. పాత అగ్రిమెంట్లను సవరించాలని  డిస్ట్రిబ్యూటర్లు వత్తిడి తెస్తున్నారు