అన్నింటికీ పచ్చ జెండా ఊపేస్తోంది !

వచ్చే నెల 6వ తేదీన నాగచైతన్య, సమంతల వివాహం జరుగనున్న విషయం విదితమే. పెళ్ళికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే పెళ్ళి పనుల్లో ఓ పక్క  నాగార్జున ఫ్యామిలీ తలమునకలై ఉంటే, సమంత మాత్రం చాలా కూల్‌గా కొత్త ప్రాజెక్టుల జాబితాను పెంచుకుంటూ పోతోంది. వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని వదులుకోకుండా పచ్చ జెండా ఊపేస్తోంది….

కథానాయికల్లో సమంత రూటే సపరేటు. తాజాగా తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి చిత్రంలో నటించేందుకు సమంత అంగీకరించడం విశేషం. సమంత ఇప్పటికే ‘రంగ స్థలం 1985’, ‘రాజుగారి గది 2’, ‘మహానటి’, ‘మెర్సల్‌ (తెలుగులో ‘అదిరింది’), ‘ఇరుంబు థిరై’, ‘నడిగైయర్‌ థిలగమ్‌’ వంటి చిత్రాలతో పాటు శివకార్తీకేయన్‌కి జోడీగా ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక పెళ్ళి విషయానికొస్తే, గోవాలో అంగరంగ వైభవంగా హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో జరిగే పెళ్ళి కోసం దాదాపు 150కి పైగా ప్రముఖుల కుటుంబాలకు ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ శుభలేఖల్ని పంపిందట. అలాగే వచ్చే నెల10వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షెన్‌ ఇచ్చేందుకు నాగ్‌ ఫ్యామిలీ సన్నాహాలు చేస్తోంది.