విడుదలకు ముందు చైతూని బాగా విసిగిస్తుందట !

పెళ్లి తర్వాత సినిమాల జోరు పెంచిన సమంతను ఓ భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందట. తాను నటించిన సినిమాలు సక్సెస్ అవుతాయో లేదోనని విడుదలకు ముందు సమంత చాలా టెన్షన్ పడుతుందట. కథ వినేటపుడు, ఆ కథను షూటింగ్ చేస్తున్నంత సేపు పాజిటివ్‌గా అనిపించినప్పటికీ తీరా విడుదల సమయంలో ఆ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో అనే భయం తనకు పట్టుకుంటుందని అంటోంది సమంత. అంతేకాదు సినిమా విడుదలకు ముందు చైతూని బాగా విసిగిస్తుందట సామ్. తన ప్రతీ సినిమాకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుందని ఆమె చెబుతోంది. సినిమా పూర్తయ్యాక ఎడిటింగ్ సమయంలో సన్నివేశాలు చూసి.. అసలు ఈ సినిమా చేశానేంటి? ఇంతకీ ఇది హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా? అనే అనుమానం తనకు ఎప్పుడూ ఉంటుందని సమంత అంటోంది.
ఇటీవలే సమంత, నాగ చైతన్య జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. పెళ్లి తర్వాత మొదటిసారి తెర పంచుకున్న ఈ జంట విజయాన్ని సాధించింది.
 
పారితోషికాన్ని పెంచేసింది
కొంతకాలంగా సమంత తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. భిన్నమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన దూకుడును కొనసాగిస్తుంది సమంత. ఇటీవల తమిళంలో శ్యామ్ చేసిన ‘సూపర్ డీలక్స్’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సిన్మాలో సమంత పాత్రపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
 
ఇక తెలుగులో సమంత చేసిన ‘మజిలీ’ చిత్రం మంచి హిట్ అయింది. నాగచైతన్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా మజిలీ నిలవడం విశేషం. దాంతో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఒక్కో చిత్రానికి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సమంత అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదని సమాచారం.