‘ఇకమీదట అంతే’నంటూ గట్టి నిర్ణయం !

సమంత అక్కినేని… అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది సమంత. అక్కినేని వారసుడు నాగ చైతన్యను పెళ్లాడింది . పెళ్లి తరువాత కూడా మంచి మూవీస్ తో విజయవంతంగా దూసుకెళ్తోంది అక్కినేని వారి కోడలు. వివాహం అయిన తర్వాత వచ్చిన రంగస్థలం, అభిమన్యుడు, యూ టర్న్ చేసింది . దీంతో పెళ్లైతే కథానాయికలకు అవకాశాలు తగ్గుతాయనే అపోహను సమంత చెరిపేసింది. ఇక ప్రస్తుతం సమంత.. భర్త నాగ చైతన్యతో కలిసి ‘మజిలీ’ అనే ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ప్రతి ఏడాది ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకుంటోంది సమంత.ఇదిలాఉంటే సమంత తాజాగా తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నిర్ణయంతో సమంత నాన్ వెజ్ ప్రియులకు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక నుంచి ముక్క ముట్టదేలేదని కరాఖండిగా చెప్పేసింది సామ్. ఓన్లీ వెజిటేరియన్ గా ఉండాలని తనకు తాను సమంత ఛాలెంజ్ చేసుకుందట. అయితే, ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి తన తల్లినే కారణమని చెప్పింది. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన కొన్ని మంచి మాటలని మరచిపోకుండా పాటించాలని సమంత బలంగా ఒక నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగానే ఇకపై మాంసాహారం తినకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల బాలీవుడ్ స్టార్స్ సైతం చాలా మంది వెజిటేరియన్ గా మారిపోయిన విషయం తెలిసిందే.
’96’ రీమేక్‌లో స‌మంత
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో 34వ చిత్రంగా రూపొంద‌నున్న చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మ‌త హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. `96` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది.