ఒక్కో చిత్రం ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది!

సమంత నాగచైతన్యను పెళ్లాడిన తరువాత సినిమాల ఎంపికలో పంథా మార్చుకుంది. ఎంపిక చేసుకున్న చిత్రాలనే చేస్తోంది. గ్లామర్‌ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత నటిగా దశాబ్దాన్ని అధిగమించింది. ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో చెబుతూ … ‘తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, అదే తన బలం అని, ఒక్కో చిత్రం ఒక్కో పాఠాన్ని నేర్పుతుందని చెప్పింది. సక్సెస్‌లను చూసి గర్వపడ లేదని అంది. తమిళ హీరో సూర్యతో నటించినప్పుడు మాత్రం గర్వంగా ఫీలయ్యానని …ఎందుకంటే కళాశాలలో చదువుతున్నప్పటి నుంచే తాను సూర్య అభిమానినని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటించడం తనకు గొప్ప విషయమేన’ని అంది.
సమంత ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటించడానికి అంగీకరించింది. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి సమంత నటిస్తుంది. అయితే, ఇప్పుడీ చిత్రం నుంచి సమంత వైదొలగిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం… సమంత అమ్మ కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో నిజం ఎంత? … ఇక పోతే ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రం నుంచి సమంత వైదొలగిందన్న ప్రచారాన్ని ఆ చిత్ర వర్గాలు, సమంత కూడా కొట్టి పారేశాయి. సమంత నటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంతో పాటు ‘మాయ’ చిత్రం ఫేమ్‌ అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని సమంత అంగీకరించింది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం.
భార్య చిత్రంలో అతిధిగా భర్త
అక్కినేని కుటుంబంలో అందరూ నటినటులే. పెళ్లి తరువాత కూడా సమంత తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ‘జాను’ తరువాత సమంత సినిమా నందిని రెడ్డితో చేయనుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారు. ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తోంది. అదేంటంటే…సమంత భర్త నాగ చైతన్య ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ‘ఓ బేబీ’ సినిమాలో కూడా చైతన్య కనిపిస్తాడు. కానీ, చాల తక్కువ నిడివిలో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినిమాలో చైతన్య పాత్ర ఎక్కువ నిడివి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.