సమంత ప్రయోగాలు వెండితెరకే పరిమితం కాదు!

‘ది ఫ్యామిలీమేన్‌’ సీజన్‌ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది. అవకాశం ఇచ్చిన రాజ్‌ అండ్‌ డీకేలకు ధన్యవాదాలు’’ అని అంది సమంత . ఆమె డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో తొలి అడుగును విజయవంతంగా ముగించింది . ‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో నటించింది సమంత . రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ తొలి సీజన్‌కు గత ఏడాది డిజిటల్‌ ఎంటర్‌టైన్‌ మీడియమ్‌లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్‌లో మనోజ్‌ బాజ్‌పేయి, ప్రియమణి, షరీబ్‌ హష్మీ, నీరజ్‌ మాధవ్‌లు కీలక పాత్రలు పోషించారు. రెండో సీజన్‌లో సమంత ఓ లీడ్‌ క్యారెక్టార్ చేశారు. ఆమె పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ–
‘‘ది ఫ్యామిలీమేన్‌’ సీజన్‌ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది.అవకాశం ఇచ్చిన రాజ్‌ అండ్‌ డీకేలకు ధన్యవాదాలు’’ అన్నారు.
‘‘మేము యాక్షన్‌ అని చెప్పిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు (సమంత) మలచుకున్న విధానం అద్భుతం. ఇప్పుడు ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో మీరూ ఒకరు. ఈ పాత్ర మీ కంఫర్ట్‌ జోన్‌లోది కాకపోయినప్పటికీ అద్భుతంగా నటించారు’’ అని సమంతను ఉద్దేశించి రాజ్‌ అండ్‌ డీకే అన్నారు. అది మాత్రమే కాదు.. ‘రెబల్‌స్టార్‌ సామ్‌!’ అని కేక్‌పై రాయించి సెట్‌లో కట్‌ చేయించారు యూనిట్‌.
 
కొత్తగా బుల్లితెరపై టాక్ షో
సమంత వెండితెరపైనే కాకుండా ఇతర మాధ్యమాల్లో కూడా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.`ఫ్యామిలీ మ్యాన్‌-సీజన్2`వెబ్ సిరీస్‌లో సమంత నటించింది. త్వరలో మరో ప్రయోగానికి సమంత సిద్ధమవుతోందట.త్వరలో బుల్లితెరపై సమంత సందడి చేయనుందట. సెలబ్రిటీలతో ఓ స్పెషల్ టాక్ ‌షోను నిర్వహించనుందట. ఇప్పటికే రానా, మంచు లక్ష్మి తదితరులు బుల్లితెరపై టాక్ షోలతో పేరు తెచ్చుకున్నారు. సమంత టాక్ షో మరింత కొత్తగా ఉండబోతోందట. వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ కార్యక్రమం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది .శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ చిత్రం ఫిబ్రవరి 7 న విడుదల కానుంది.
 
నన్ను విపరీతంగా తిట్టుకుంటారు
“ఈ పాత్రను అంగీకరించే సమయంలో ప్రేక్షకులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు లేదా బాగా అభినందిస్తారు అనుకుంటూ ఒప్పుకున్నాను”… అని అంటోంది సమంత. కొన్నిసార్లు సినిమాలోని పాత్రలు రిస్కీగా ఉంటాయి. అనుకున్న విధంగా తెరమీద కనిపించకపోతే నటులు విమర్శలపాలు కావాల్సి ఉంటుంది. అనుకున్నట్టే జరిగితే అన్నీ ప్రశంసలే. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ అంగీకరించే ముందు సమంత కూడా ఇలాంటి సందర్భాన్నే ఎదుర్కొన్నారట. ఈ సినిమాలో సమంత పాత్ర బోల్డ్‌గా… కొంచెం నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుంది. అయితే ఈ పాత్ర సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. బెస్ట్‌ యాక్టర్‌గా తమిళంలో అవార్డును కూడా అందుకుంది .
‘‘ఈ పాత్రను అంగీకరించే సమయంలో ‘ప్రేక్షకులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు లేదా బాగా అభినందిస్తారు’ అనుకుంటూ ఒప్పుకున్నాను.నా పాత్రకు ఎటువంటి విమర్శలు రాలేదు. ఈ సినిమాలో నటించడం నాకో మంచి అనుభవం’’ అని అవార్డును అందుకున్న తర్వాత చెప్పింది సమంత.