ఇక సినిమాలు చేయకూడదనుకుందట !

‘ఓ బేబీ’ తర్వాత సమంత ఇక సినిమాలు చేయకూడదనుకుందట.అలాంటి కథలను ఎంపిక చేసుకోవడం మళ్లీ సాధ్యమయ్యే పని కాదనే ఆలోచనతో సమంత అలా భావించిందట.‘ఓ బేబీ’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమంత తదుపరి చిత్రం కోసం ఎలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకుంటుందా..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ స్టార్ హీరోయిన్‌కు వరుసగా రీమేక్ సినిమాలు కలిసొస్తున్నాయి. ‘యూ టర్న్’ కన్నడ రీమేక్. తాజా చిత్రం ’ఓ బేబీ’ కొరియన్ రీమేక్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్ దిశగా సమంత ఆలోచనలున్నాయని తెలిసింది. అది కూడా హీరోయిన్ సెంట్రిక్ మూవీనే అట.
 
ఎప్పటికప్పుడే కొత్త కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. యంగ్ టాలెంట్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు. కొంచెం దృష్టి పెడితే, ఆ కొత్త కథలన్నీ దృశ్యరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉంటాయి. అలాంటి కథల్లో నటించేందుకు సమంత వంటి నటీనటుల అవసరం ఎప్పుడూ ఉంటుంది.ఇక పెళ్లి తర్వాత సమంత ఎంచుకునే పాత్రలన్నీ ఆసక్తికరంగా ఉంటున్నాయి.చర్చల్లో నిలుస్తున్నాయి. అలాంటి చర్చనీయాంశమైన పాత్రలోనే మళ్లీ సమంత నటించనుందట.
 
ఇప్పటికే ఓ రీమేక్ స్టోరీని సమంత లైన్‌లో పెట్టిందని తెలిసింది. ఇదిలాఉండగా ఈ స్టార్ హీరోయిన్‌ను లీడ్ రోల్‌లో పెట్టి అమెజాన్ ప్రైమ్ వారు ఓ వెబ్‌సిరీస్‌ని రూపొందించాలనుకుంటున్నారట. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలో ప్రకటించనుందట సదరు డిజిటల్ సంస్థ.
 
నయనతార సినిమాలో సమంత ?
వరసపెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది సమంత. పెళ్లయ్యాక ఆమెకు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ అవకాశాన్ని ఆమె నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటోంది. ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది.
 
ఈ నేపథ్యంలో ఆమెకు వరుసగా హిట్స్ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయనతార చేయాల్సిన ఒక సినిమా సమంత వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. ఇదివరకు తమిళంలో వచ్చిన ‘అరమ్’ సినిమాకు సీక్వెల్‌లో సమంత నటించబోతోందని తెలిసింది. తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలైన ఆ సినిమాకు సీక్వెల్ ప్రతిపాదన ఉంది. ముందుగా నయనతార అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ అవకాశం దక్కబోతున్నట్టుగా తెలిసింది.