పరిస్థితి చెయిదాటక ముందే బయటపడ్డాను!

“నేను ముందుగానే జాగ్రత్తపడి.. పరిస్థితి చెయిదాటక ముందే ఆ బంధం నుంచి బయటపడ్డాను.సరైన సమయంలో మేల్కొన్నా.. లేకపోతే నేను మరో సావిత్రిని అయ్యుండేదాన్న”ని సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి సమంత సంచలన కామెంట్స్ చేసింది. సమంత ఇలా మాట్లాడింది.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించే. హీరో సిద్ధార్థ్‌తో సమంత ప్రేమాయణం గురించి గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత చైతన్యతో ప్రేమలో పడిన సమంత అతన్ని పెళ్ళిచేసుకుంది .
“మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయో.. నా జీవితంలోనూ అలాంటివే చోటుచేసుకున్నాయి. అయితే నేను ముందుగానే జాగ్రత్తపడి.. పరిస్థితి చేయదాటక ముందే ఆ బంధం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత చైతన్యలాంటి గొప్ప వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించింద”ని సమంత చెప్పింది.
 
అత్యంత దారుణంగా తిట్టారు !
నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. ‘ప్రత్యూష ఫౌండేషన్‌’ పేరిట ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు.. సామాజిక అంశాలతో పాటు, మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా పెడుతుంటారు .వీటికి ఫొటోలకు ప్రశంసలు, విమర్శలు సర్వసాధారణం. కానీ కొన్ని మాత్రం.. ఇలాంటి ఫొటో ఎందుకు పెట్టామా? అని పశ్చాత్తాపపడేలా చేస్తాయి. కథానాయికలు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్‌ను ఎదుర్కోవల్సి వస్తుంది. అదీ పాపులర్‌ నటీమణులకైతే మరీ ఇబ్బంది. అదే పరిస్థితి సమంతకు కూడా ఎదురైంది. వివాహం అనంతరం తన భర్తతో బీచ్‌లో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ‘వివాహం తర్వాత భారతీయ మహిళలు ఎలా ఉండాలో కూడా ఈ సెలబ్రిటీకి తెలియదా?’ అంటూ సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి…
” నా కెరీర్‌లో మొదటిసారి అంతలా భయపడ్డా. అత్యంత దారుణంగా తిట్టారు. నా పెళ్లి తర్వాత కాస్త హాట్‌గా ఉన్న ఫొటోను పోస్టు చేశా. ఆ ఫొటో నాలో విపరీతమైన భయాన్ని తెచ్చిపెట్టింది. నా కెరీర్‌లో మొదటిసారి అంతలా భయపడ్డా. అత్యంత దారుణంగా తిట్టారు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. రెండో సారి పోస్టు చేస్తే.. నన్ను తిట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ విషయంలో నేనేదో ధైర్యం చేశానని చెప్పలేను. ఆ ట్రోలింగ్‌ పరిణామాలతో భయపడిపోయాను. ‘పరిస్థితులు మారాయి. దానిలో భాగంగానే నేనూ మారాను’ అని నాకు నేను సర్ధిచెప్పుకున్నా” అని చెప్పింది సమంత.