అటువంటి సినిమాలు అసలే వద్దు !

సమంత… ఓ తెలుగు చిత్రానికి  నో చెప్పిందనే వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కావడం విశేషం.ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క నాగచైతన్య సరసన ‘మజిలీ’లో నటిస్తోన్న సమంత.. మరో పక్క శర్వానంద్ సరసన తమిళ చిత్రం ’96’ రీమేక్ కు కూడా సిద్ధమవుతోంది. అలాగే నందినిరెడ్డి దర్శకత్వంలో కొరియన్ రీమేక్ ‘ఓ బేబీ’ లోనూ నటిస్తోంది. ఆల్రెడీ సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆమె ఓ తెలుగు చిత్రానికి మాత్రం నో చెప్పిందనే వార్తలొస్తున్నాయి.
ఆ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కావడం విశేషం.బెల్లంకొండ శ్రీనివాస్ సాధారణంగా తన సినిమాలకు టాప్ హీరోయిన్స్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. కాజల్, సమంత, రకుల్ వంటి టాప్ స్టార్స్ అతగాడి సరసన ఆల్రెడీ జోడీ కట్టేశారు. పారితోషికం ఎక్కువైనా అగ్ర కథానాయికలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు శ్రీనివాస్. అలా బెల్లంకొండ తాజా చిత్రంలో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారట… ‘ఆర్.ఎక్స్ -100’ దర్శకుడు అజయ్ భూపతి రెండో చిత్రం ‘మహాసముద్రం’ కోసం. అయితే ఇంతకు ముందు బెల్లంకొండతో ‘అల్లుడు శ్రీను’లో నటించినా.. ఈ సినిమాకి మాత్రం సమంతా నో చెప్పినట్లు వినిపిస్తోంది.
అజయ్ భూపతి తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ -100’ బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో కథానాయిక పాయల్ రాజ్ పుత్ హై రేంజ్‌లో గ్లామర్ ఒలికించి సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు రెండో చిత్రం ‘మహాసముద్రం’లో సమంతా నుంచి ఓవర్ గ్లామర్ ఎక్స్ పెక్ట్ చేశాడట . అయితే సమంత భారీ పారితోషికం ఆఫర్ చేసినా మితిమీరిన అందాల ఆరబోతకు నో చెప్పి.. ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. దాంతో అజయ్ భూపతి టీమ్.. మరో కథానాయిక అన్వేషణలో పడ్డారట.
నా ఎదుగుదలతో చాలా సంతృత్తిగా ఉన్నా!
పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన సమంత.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈమె చేస్తున్న తాజా సినిమాల్లో ‘ఓ బేబీ’ చిత్రం ఒకటి. ‘ఎంత సక్కగున్నావే’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో సమంత యువతి గాను, వృద్ధురాలి గాను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా సమంత తన సినీ జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది…..  ‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కాస్త సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ప్రస్తుతం నా ఎదుగుదలతో చాలా సంతృత్తిగా ఉన్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన దేవుడు, వ్యక్తుల పట్ల కృతజ్ఞురాలిగా ఉంటా’’ అని పోస్ట్‌లో పేర్కొంది సామ్.