అక్కినేని కోడలికి మరీ ఇంత క్రేజా !

లాక్ డౌన్‌లో కూడా కెరీర్  డౌన్ కాకుండా జాగ్రత్త పడింది సమంత. ముఖ్యంగా లాక్ డౌన్ మొదలయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు మాత్రం చేరువగా ఉంటోంది . సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇంటి పైనే గార్డెనింగ్ చేసి మరింత పాపులర్ అయింది. ‘హీరోయిన్ లు పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించడం కష్టమే. కొనసాగించినా కూడా స్టార్ హీరోయిన్ గా ఉండలేరు’ అంటూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అపోహలను తొలగించి వేసింది సమంత. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈమె క్రేజ్ అలాగే ఉంది. మార్కెట్ ఎక్కడా తగ్గలేదు.

సమంత ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలను పక్కనబెట్టేసి బిజినెస్ లో బిజీ అయ్యింది . సాకీ డ్రెస్ బ్రాండ్ ప్రచారం.. స్కూల్ బిజినెస్ అంటూ కొత్త కొత్త వ్యాపకాలపైకి ఫోకస్ చేసింది సమంత. ఇలాంటి సమయంలోనే డిజిటల్ మీడియాపై కూడా దృష్టి పెట్టింది . ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. ఇదిలా ఉంటే ‘ఆహా’లో ఈమె ఓ షో చేస్తుంది. ఈ టాక్ షోకు ‘స్యామ్ జామ్’ అని పేరు పెట్టారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ వచ్చాయి. మరో నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 1 కోసం 8 ఎపిసోడ్స్ షూట్ చేసిన సమంత అక్కినేని.. వాటి కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలు. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కేవలం 8 ఎపిసోడ్స్ కోసం కోటి రూపాయల పారితోషికం అందుకుంది సమంత.

విజయ్ దేవరకొండతో మొదలైన ‘స్యామ్ జామ్’ తొలి సీజన్ కు రెండో గెస్టుగా రానా వచ్చాడు. మూడో ఎపిసోడ్ కోసం సైనా నెహ్వాల్ జంట వచ్చారు. నాలుగో ఎపిసోడ్ తమన్నాతో చేసింది సమంత. ఇప్పుడు రకుల్ నెక్ట్స్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉంది. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అర్జున్, నాగ చైతన్య కూడా ఉన్నారు. ఈ మూడు ఎపిసోడ్స్ తో తొలి సీజన్ పూర్తి కానుంది. ఏదేమైనా కూడా 8 ఎపిసోడ్స్ కోసం కోటి రూపాయలు అంటే.. ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 8 లక్షలకు పైనే తీసుకుంది . సమంత క్రేజ్ చూసి మిగిలిన స్టార్ హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.

పాత్రలకు స్వయంగా డబ్బింగ్!… అక్కినేని వారి కోడలు అయ్యాక సమంత మరింత గ్లామర్‌తో సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తూనే ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌‌ సిరీస్‌ సీజన్‌ 2లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత నెగిటివ్‌ రోడ్‌ చేస్తోంది. అయితే ఈ సిరీస్‌  పలు భాషలలో నిర్మిస్తున్నందువల్ల  ఆయా బాషల్లో సమంత తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమాల్లో సమంతకు ప్రముఖ గాయని చిన్మయి డబ్బింగ్‌ చెప్తున్న విషయం తెలిసిందే. సమంత తన అందం, అభినయంతో ఎంతమంది అభిమానులను సంపాదించిందో..దాంతో పాటు  సినిమాల్లో ఆమె వాయిస్‌ పాత్ర కూడా అంతే ప్రధానమయ్యింది.