నిర్మాతలకి భారం కారాదని మంచి నిర్ణయం!

సమంత తమిళంలో ఓ మూవీ చేయనుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి సమంత నటిస్తుంది. ఈ మూవీ కోసం సమంత తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ చిత్రం కావడం.. చిన్న బడ్జెట్ మూవీ కావడంతో పాటు.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు ఇబ్బందుల్లో ఉండటంతో, వారికి భారం కాకూడదని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది.  ఈ ఏడాది సమంత ‘జాను’ చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక టాలీవుడ్‌లో ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్‌పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
‘ఈశా క్రియ’‌ని ప్రారంభించా!
స‌మంత సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, ఆరోగ్యాన్ని ఏ మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌దు. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎల్ల‌ప్పుడు హెల్తీగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇక కరోనా కాలంలో ఈ అమ్మ‌డు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌ముఖ‌లు స‌ల‌హాల‌ని పాటిస్తూ ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంది.
తాజాగా స‌మంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ.. యోగా ప్ర‌క్రియ‌ల‌లో ఒక‌టైన ఈశా క్రియ‌ని ప్రారంభించిన‌ట్టు చెప్పుకొచ్చింది. 48 రోజుల పాటు తాను ఈశా క్రియ‌ని చేస్తానని… త‌న అభిమానులు కూడా ఈశా క్రియ చేస్తూ.. తనతో కలవాలని కోరింది. దీని వ‌ల‌న మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఆరోగ్యం, సామ‌ర్ధ్యాన్ని పెంచే శ‌క్తి ల‌భిస్తుంద‌ని పేర్కొంది. అందంతో పాటు ఆరోగ్యం కూడా చేకూర్చే ఈశా క్రియ చేయడం చాలా మంచిది అని స‌మంత పేర్కొంది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా స‌మంత ఇలాంటి యోగా ప్ర‌క్రియ‌లు చేస్తుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు
 
పాన్‌ ఇండియా సినిమాలో…?
వైవిధ్యమైన సినిమాలకు, భిన్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కథానాయిక సమంత. ఓ పక్క కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క అవకాశం దొరికినప్పుడల్లా మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటిస్తూ అందర్నీ అలరిస్తోంది. ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత  ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే పాన్‌ ఇండియా సినిమాలో  నటించబోతుందనే వార్తలు వినిపించాయి. దీంతోపాటు తాజాగా మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అదేంటంటే.. మహిళా ప్రధానంగా సాగే ఓ సినిమాలో సమంత నటించనుందట. తెలుగులోపాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించ బోతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ ఈ సినిమాని పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యత్నాల్లో ఉందట. ఇదే నిజమైతే, సమంత నటించబోయే తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే అవుతుందని వేరే చెప్పక్కర్లేదు.