కలల వెంట నిరంతరం పరుగెత్తాల్సిన పని లేదు!

ఇళ్లకే పరిమితం అయిన తారలందరూ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. సమంత అక్కినేని కూడా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు…
 
# మీ అభిమానుల గురించి?
వాళ్లే నా బలం.. బలహీనత
# మిమ్మల్ని ద్వేషించే వారికి మీరిచ్చే సమాధానం?
పొగడ్తలు నన్ను సోమరిని చేస్తాయి. అదే విమర్శలు మాత్రం నాలోని బెస్ట్‌ను బయటకు తీయడానికి ఉపయోగపడ్డాయి. నన్ను విమర్శించే వాళ్లకు ఇదే నా సమాధానం
# చైతన్య గురించి ఒక మాటలో చెప్పాలంటే?
తను నా హ్యాపీనెస్‌
# చైతన్య, సామ్‌లో ఎవరూ ఎక్కువగా జిమ్‌ చేస్తారు?
చైతన్యే.. నేను కష్టపడ్డట్లు నటిస్తుంటాను.
# అమల గురించి రెండు మాటలు?
ఆమె మంచి ఫ్రెండ్‌, మార్గదర్శకురాలు
# లాక్‌డౌన్‌ సమయంలో మీరు కొత్తగా నేర్చుకున్న విషయమేంటి?
కలల వెంట నిరంతరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రేమానురాగాలున్న కుటుంబంతో గడపటమే ఓ కల కావొచ్చు. మీకు ఎక్కువ ఆనందాన్నిచ్చే కల మీ ఇంట్లోనే ఉండొచ్చు.
# లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌గా ఉండటానికి ఏం చేశారు?
ఉపవాసం ఉన్నాను. కొన్నిసార్లు ఉపవాసం ఉండటానికి బలవంతంగా కూడా ప్రయత్నించాను. ఎందుకంటే నేను ఎక్కువగా బిర్యానీ తింటాను. అలాగే స్పైసీ ఫుడ్‌ను బాగా తింటాను. లాక్‌డౌన్‌ సమయంలో మూడు బాటిల్స్‌ పచ్చళ్లను అవగొట్టేసాను. అలాగే మామిడిపళ్లు కూడా తింటున్నాను. కాబట్టి ఉపవాసం నన్ను మంచి అమ్మాయిగా మారుస్తుందని నమ్ముతున్నాను.
# లాక్‌డౌన్‌లో చైతు కోసం వంట చేశారా? మీరు కొత్తగా నేర్చుకున్న వంటకమేంటి?
చైతు కోసం గరిటె తిప్పాను. ఈ ఖాళీ సమంయలో షక్‌షుకా అనే కొత్త వంటకం నేర్చుకున్నాను.
# సెలబ్రిటీగా మీకు కష్టంగా అనిపించే అంశమేంటి?
మన గురించి నిజం కాని విషయాలను వినడం చాలా కష్టమైన పని
# మీకు బాగా నచ్చిన చిత్రాలు?
‘జోజో ర్యాబిట్’‌..ఈ మధ్య బాగా నచ్చిన చిత్రం. అయితే చిన్నప్పటి నుండి ‘ద సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్’‌ సినిమాను ఇష్టపడతాను. అది నా ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ మూవీ.
 
సమంత తల్లికాబోతోందని…
సమంత ‘ఓ బేబీ’ హిట్‌ తరువాత ఆమె‌ నటించిన ‘జాను’ మూవీ ఫ్లాప్‌ అయ్యింది. ఆ తరువాత ఆమె ఒక్క సినిమాకు కూడా సంతకం చేయలేదు. ప్రస్తుతం ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. అందరు సెలబ్రిటీలలాగే సామ్‌ కూడా కరోనా లాక్‌డౌన్‌ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ విషయం సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా సమంత తల్లి కాబోతోందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. వార్తలను సమంత ఎంత ఖండించినా ఆగడం లేదు. సమంత తాజాగా ట్విటర్‌లో పోస్టు చేసిన ఫొటోలో సమంత విక్టరీ‌ సింబల్‌ చూపిస్తూ ఉంది. ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచింది వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో.. సమంత తల్లికాబోతోందని పరోక్షంగా చెప్పిందని అంటుంటే.. మరికొందరేమో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ తరువాత ఎన్‌టిఆర్‌, త్రివిక్రమ్‌ సినిమాలో నటించబోతోందని, అందుకే ఇలా పెట్టిందని అంటున్నారు. దీనిపై ఆమె,నాగ చైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి …