డెబ్బై ఏళ్ళ వృద్ధురాలిగా థ్రిల్ చేస్తుందంట సమంత !

సమంత వరుస సినిమాలతో మంచి జోరుమీదుంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమెకు వరుస విజయాలు దక్కుతున్నాయి. సమంత ఇటీవల ‘‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’’ రూపంలో భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. సమంత ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌ను ఎంచుకుంటుందన్న విషయం తెలిసిందే. కొంచెం లేటయినా చక్కటి స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటుంది. తాజా గా ఆమె ‘మిస్ గ్రానీ'(2014) అనే కొరియన్ ఫిలిం రీమేక్‌లో కనిపించబోతోందట.ఈ చిత్రంలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. అదే వృద్ధురాలి పాత్రలో నటించబోతుంది. ‘మిస్‌ గ్రాన్నీ’ అనే కొరియన్‌ చిత్రం ఆధారంగా ఈ కథను సిద్ధం చేసింది దర్శకురాలు నందినీ రెడ్డి. ఓ వృద్ధురాలు యువతిగా ఎలా మారిందనే నేపథ్యంలో ఈ కథ ఉంటుంది.  వృద్ధురాలిగా ఉన్న సమంత యువతిగా  ఎలా మారిందన్నదే ఆసక్తికరంగా రూపొందించబోతున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్‌ను నందినీ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.’మిస్ గ్రానీ’ పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమాని చాలా భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
కామెడీ, ఎమోషనల్ కలబోత అయిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. ఒక 70ఏళ్ల వృద్ధురాలు మిస్టీరియస్ ఫోటో స్టూడియోలో ఫోటో తీయించుకుని… అదే స్టూడియోలో తన ఇరవై ఏళ్ల వయసప్పటి ఫోటోను చూస్తుంది. ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుందని… ఇదే ఈ సినిమా కాన్సెప్ట్‌ అని తెలుస్తోంది.  ఈ కామిక్ డ్రామాకు సంబంధించిన స్టోరీ  సమంతకు చెప్పిన వెంటనే …ఆమె థ్రిల్ అయ్యి చేసేందుకు ఒప్పుకుందట. ఈ పాత్ర తనను కొత్తగా ఎలివేట్ చేస్తుందని సమంత నమ్ముతోందని, ఈ సినిమా చేస్తున్నందుకు సమంత చాలా ఆనందంగా ఉందట.
సినిమా పై అంచనాలు పెంచేసింది !
సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో సమంత పాత్రికేయురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సమంత మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు భూమిక ఓ కీలకపాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కన్పించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై సినిమా పై అంచనాలను పెంచేసింది. వేగంగా వ్యూస్ రాబడుతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘యూ టర్న్‌’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు