ఎన్నో భయాలను అధిగమించి యాంకర్ గా చేశా!

రియాల్టీ షో ‘బిగ్ బాస్’‌లో దసరా సందర్భంగా వ్యాఖ్యాతగా అక్కినేని వారి కోడలు సమంత కనపడిన విషయం తెలిసిందే. ‘ఈ రోజు నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’ అంటూ ఆమె పంచిన వినోదం అందరినీ ఆకర్షించింది. తాను యాంకర్ అవతారం ఎత్తిన విషయానికి సంబంధించి సమంత ఆసక్తికర విషయాలు చెప్పింది. ఎప్పుడూ గుర్తుండిపోయే మంచి అనుభవం ఎదురైందని సమంత అంది.. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. తన మామ నాగార్జున వల్లే ఆ షోకి వచ్చానని..ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చిందని వివరించింది. తాను ఇంతకుముందు ఏ షోకీ వ్యాఖ్యాతగా వ్యవహరించలేదని చెప్పింది. తనకు తెలుగు సరిగ్గా రాదని, అంతేగాక, ఇంతకు ముందు ‘బిగ్‌బాస్’‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని తెలిపింది. తన మీద నమ్మకముంచి తనను పోత్సహించినందుకు తన మామ నాగార్జునకు ధన్యవాదాలు చెప్పింది. ఆ షో చూసి తనపై చాలా ప్రేమ కురిపించిన ప్రేక్షకులకూ ధన్యవాదాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

హ్యాట్సాఫ్‌ టు సమంత!… హీరోయిన్‌ సమంత… తన పెద్ద మనసును మరోసారి చాటుకుంది. ఆమె ‘ప్రత్యూష ఫౌండేషన్’‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు కూడా భాగ్యనగరంలో ఉన్న పేద ప్రజల ఆకలి తీర్చుతోంది. కరోనా విలయ తాండం ఒక వైపు అయితే మరోవైపు వర్షాలు, వరదలతో భాగ్యనగర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటమునిగిన ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లే ఎక్కువ. పేద ప్రజల దుస్థితిని చూసి కదలిపోయిన సమంత ప్రత్యూష ఫౌండేషన్‌.. ‘డిగ్నిటీ డ్రైవ్‌ ఫౌండేషన్’‌తో చేతులు కలిపింది. వాలంటీర్ల సహయంతో ఆహారాన్ని వండి.. ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేసింది. వలంటీర్లు ఆహారాన్ని వండుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. హ్యాట్సాఫ్‌ టు సమంత…!

తొలిసారి ఉగ్ర‌వాదిగా… లాక్‌డౌన్ త‌ర్వాత ప్రేక్షకులు సినిమాల‌ను కూడా ప‌క్క‌నపెట్టి వెబ్ సిరీస్ వెంట ప‌డుతున్నారు. దీని క్రేజ్ గుర్తించిన న‌టీన‌టులు నెమ్మ‌దిగా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నారు. అగ్ర‌తార‌లు కూడా వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు.  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ – 2’లో న‌టించింది. ఇది ఘ‌న‌ విజ‌యం సాధించిన ‘ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌’కు సీక్వెల్ .

సమంత అందులో తొలిసారి ఉగ్ర‌వాదిగా క‌నిపించ‌నున్న‌ట్లు వార్తలు వచ్చాయి. ఇందులో సామ్‌ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. మ‌నోజ్ భాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి, సందీప్ కిష‌న్‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ  షూటింగ్ కూడా పూర్తైన‌ట్లు ద‌ర్శ‌కుడు రాజ్‌, డీకే అధికారికంగా వెల్ల‌డించారు. నెగెటివ్ రోల్‌లో సమంతను చూసేందుకు ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ‘ఫ్యామిలీ మ్యాన్ – 2′ త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.