డబ్బు కోసం ఇలాంటి యాడ్స్ చేస్తావా ?

సమంత… స్టార్‌ హీరో హీరోయిన్స్‌ కొన్ని ప్రొడక్ట్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం సర్వసాధారణం. అందుకు వారికి భారీ స్థాయిలోనే పారితోషికాలు అందుతుంటాయి. దాంతో కొంతమంది స్టార్స్‌ వెనుకాముందు ఆలోచించుకోకుండా కొన్ని అభ్యంతరకరమైన ప్రొడక్ట్స్‌కు కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. గతంలో చిరంజీవి థమ్‌అప్స్‌ యాడ్‌కు వచ్చినప్పుడు విమర్శలు తలెత్తాయి. అప్పుడు సోషల్‌మీడియా ఊపందుకోలేదు.ప‌లు సంస్థ‌ల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటున్న స‌మంత తాజాగా ఓ ప్రముఖ చిప్స్ కంపెనీని ప్ర‌చారం చేసే బాధ్య‌త‌ల‌ని తీసుకుంది. చిప్స్ ప్యాకెట్‌ తో ఫోటో దిగిన సామ్ ఈ కంపెనీకి ప్రచార‌క‌ర్త‌గా ఉండ‌డం సంతోషంగా ఉంద‌ని త‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ పెట్టింది. తాజాగా సమంత ‘కుర్‌ కురే’ ప్రొడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ వ్యవహరించబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే ఆ చిప్స్ ఆరోగ్యానికి హానిక‌రం. అవి తింటే అనారోగ్యానికి గుర‌వుతాం. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని క‌లిగించే ఫుడ్ తిన‌మ‌ని ప్ర‌చారం చేయ‌డం ఏ బాగోలేదు అంటూ ప‌లువురు నెటిజన్స్ స‌మంత‌కి ట్వీట్స్ చేశారు.ఆరోగ్యానికి హానికరమైన ఇలాంటి ప్రొడక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎలా వ్యవహరిస్తారు అంటూ.. కొంతమంది నెటిజన్లు సమంతకు ట్వీట్స్‌ పెడుతున్నారు. “డబ్బు కోసం ఇలాంటి వాటికి సపోర్ట్‌ చేస్తావా.. దయచేసి చెయ్యొద్దు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ట్వీట్స్‌కి సమంత ఇలా స్పందించింది… “నా సండే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా. అవును..ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటాను. అలాగే మామూలు రోజుల్లో ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవ‌డం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ నాతో పాటు, మీరు అడిగే ప్ర‌తి ప్ర‌శ్నకి స‌మాధానం చెబుతుంది” అని నెటిజ‌న్స్‌కి స‌మాధానం ఇచ్చింది.
 
ఆ ప్రయాణం ఎన్నో నేర్పించింది!
దక్షిణాది అగ్రతార సమంత తన కాలేజీ రోజుల్ని ఇంకా మర్చిపోలేదు. ఒకవైపు సినిమాల్లో బిజీగా నటిస్తూనే, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంపైనా దృష్టి పెడుతోంది. ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ‘ఫేమస్లీ ఫిలింఫేర్‌’ ఎక్స్‌క్లూజివ్‌ ప్రోగ్రామ్‌లో సమంత చెన్నైలో తన యూత్‌ డేస్‌ను గుర్తుచేసుకుంది. ‘ప్లస్‌ వన్‌ లేదా ప్లస్‌ 2 చదువుతున్నాను అనుకుంటాను. పాకెట్‌ మనీ కోసం నేను, నా స్నేహితులు జాబ్‌ వెతికేవాళ్లం. తాజ్‌ కోరమండల్‌లో చాలా కంపెనీలు ఈవెంట్లు నిర్వహించేవి. నేను, నా ఫ్రెండ్స్‌ రిసెప్షన్‌ కమిటీలో దరఖాస్తులు పూర్తి చేయడం వంటి పనులు చేసేవాళ్లం. ఆ ప్రయాణం ఎన్నో నేర్పించింది. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని సమంత ‘ఫేమస్లీ ఫిలింపేర్‌’లో పేర్కొంది.