వాస్తవానికి దగ్గరగా ఉండటమే ఇష్టమట !

నేల విడిచి సాము చెయ్యనంటోంది సమంత. సౌత్‌లోసమంత  స్టార్ హీరోయిన్. తెలుగు,తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లైనా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. అయితే కెరీర్‌లో ఎంత పీక్స్‌కు వెళ్ళినా, నేల విడిచి సాము చెయ్యనంటోంది సమంత. వాస్తవానికి దగ్గరగా ఉండడానికే ఇష్టపడుతుందట. నాగచైతన్య కూడా ఇలాగే ఆలోచిస్తాడట. అందుకే ఈ జంట తమ చేతిపై ‘బాణాలను’ టాటూగా వేయించుకున్నారట. రోమన్ భాషలో ఈ బాణాల గుర్తుకు ‘‘వాస్తవంలో ఉండండి, మీలా మీరు ఉండండి’’ అని అర్థం. అందుకే చై-సామ్ ఇద్దరూ తమ చేతిపై ఈ టాటూ వేయించుకున్నారట.స్వయంగా సమంతాయే ఈ టాటూ సీక్రెట్‌ని రివీల్ చేసింది.
నాగచైతన్య, సమంత ఇద్దరూ వాస్తవంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా స్టార్స్ అయినా కామన్ పీపుల్ లాగే ఆలోచిస్తుంటారు. గర్వానికి చోటివ్వకూడదని అనుకుంటారు. ఈ అభిరుచులే చై-సామ్‌ని కలిపాయట. వాళ్ల ప్రేమ కథకు బీజం వేసి పెళ్లి పీటలెక్కించాయట. ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు. సమంత ‘యూ- టర్న్’ రీమేక్‌తో పాటు, తమిళ్లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే శివనిర్వాణ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలసి ఓ చిత్రంలో నటిస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
ఆమె క్రేజ్ కారణంగానే అంత ధర !
ప్రస్తుతం ప్రతీ తెలుగు సినిమాకీ హిందీ డబ్బింగ్ రైట్స్ అదనపు ఆదాయ వనరుగా మారుతున్నాయి. సమంత లేటెస్ట్ మూవీ ‘యూ- టర్న్’ చిత్రానికైతే కళ్ళు చెదిరే ధర పలికిందట. కన్నడ సినిమా ‘యూ-టర్న్’ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది. అమ్మడి ప్రెజెన్స్ ఈ సినిమాకి మరింత అడ్వాంటేజ్ కానుందట. ఈ సంవత్సరం సమంత ‘‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’’ చిత్రాలతో వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది.
 
పెళ్ళయ్యాక మరింత స్పీడ్‌గా సినిమాలు చేసేస్తున్న సమంత.. ప్రస్తుతం ‘యూ టర్న్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్న అమ్మడి క్రేజ్ కారణంగా ఆ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయట. ఈ మూవీ రైట్స్ కోసం రూ. 2.10 కోట్లు చెల్లించారని తెలుస్తోంది. ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాకు ఇచ్చే మొత్తం కన్నా చాలా ఎక్కువే కావడం విశేషం.
 
ఇప్పుడు మన సినిమాలు దాదాపుగా అన్నీ హిందీలోకి డబ్ అవుతున్నాయి. ఇదివరకు అంటే సినిమా రిలీజయ్యాక ఎంతో కొంత ఇచ్చి డబ్బింగ్ రైట్స్ తీసుకునేవారు. ఇప్పుడు నిర్మాణంలో ఉండగానే హిందీ డబ్బింగ్ కోసం అడ్వాన్సులిచ్చేస్తున్నారు. ‘యూ-టర్న్’ చిత్రం ఆల్రెడీ కన్నడలో విజయవంతమైన చిత్రం. పైగా థ్రిల్లర్  మూవీ కావడంతోనే ఈ సినిమాకి అంత భారీ ధరపలికింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడైన పవన్ కుమారే తెలుగు యూటర్న్‌కీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ లాంటి హీరోలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.