బాలీవుడ్ కు ‘సమ్ థింగ్ డిఫరెంట్’ సమంత

 బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి తారలు పెళ్లి తరువాత కూడా గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది సినీ రంగంలో ‘పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టే’ అని భావిస్తున్నారు. కానీ అందరి విషయంలో అలా జరగదు.అయితే సౌత్ లో అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ. దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత మాత్రం ‘సమ్ థింగ్ డిఫరెంట్’ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు ఇప్పటి వరకు దక్షిణాది ప్రేక్షకులను మాత్రమే అలరించిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సామ్.ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ నెల 6న నాగచైతన్యను పెళ్లాడనున్న ఈ భామ, తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి షూటింగ్ లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

మిథాలీ రాజ్‌ బయోపిక్‌ లో సమంత …?

అటు బాలీవుడ్‌లోనూ ఇటు దక్షిణాదిలోనూ బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే క్రికెట్‌ దిగ్గజాలు అజహ రుద్దీన్, ధోనీ, సచిన్‌ల బయోపిక్‌లతో సినిమాలొచ్చాయి. తాజాగా భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ రూపొందనుందట. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో సమంత నటించనున్నారని సమాచారం.

ప్రియాంకా చోప్రాతో ‘మేరీకోమ్‌’ బయోపిక్‌ను నిర్మించిన వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ మిథాలీ బయోపిక్‌ను పలు భాషల్లో రూపొందించనుందట. మిథాలీ పాత్రకు సమంత న్యాయం చేయగలరని వయాకామ్‌ సంస్థ ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మరి..  మిథాలీ రాజ్‌ బయోపిక్‌ లో నటించేందుకు సమంత గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారా? వెయిట్‌ అండ్‌ సీ.