నిజమైన అందం అంటే ఆమెదే !

 సినిమాల్లో కొందరు నటీనటులు సామాన్యులకు అండగా ఉంటూ.. వారికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ కనిపిస్తారు, కానీ, రియల్ లైఫ్‌కి వచ్చేసరికి సామాన్యుల దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. చాలా మంది హీరో.. హీరోయిన్లు రీల్ లైఫ్‌కి రియల్ లైఫ్‌కి చాలా తేడా కనబరుస్తుంటారు.కానీ కొందరు మాత్రం నిజజీవితంలో కూడా సామాన్యులతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో భాగస్వాములవుతుంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు ప్రముఖ నటి , అక్కినేని వారి ఇంటికోడలు సమంత. ఆమె ‘ప్రత్యూష ఫౌండేషన్‌’ను నడుపుతున్న విషయం తెలిసిందే. దాని ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆమె తమ సంస్థ ద్వారా విజయవాడలో 15మంది శిశువులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేయించి వారికి ప్రాణదాతగా మారారు. ఆ చిన్నారుల ఫోటోలను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన సమంత “మరో గుండె సంబంధిత ఫ్రీ శస్త్ర చికిత్సల క్యాంప్‌ను విజయవాడ, ఆంధ్రా హాస్పిటల్స్‌లో నిర్వహించాం. 15మంది లవ్‌లీ కిడ్స్‌కి ఈ ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు వారంతా హెల్దీ హార్ట్స్‌తో ఉన్నారు” అంటూ ట్వీట్ చేసింది. ఇక సామ్ ఇంత మంచి పని చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ‘నిజమైన అందం అంటే ఆమెదే’ అని అంటున్నారు .