నటిగా.. స్థాయితో పాటు పారితోషికమూపెరిగింది !

మన తారలు సినిమాల పారితోషికాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించటం వలననే ఆదాయం పొందేవారు. షాప్ ఓపెనింగ్స్, టీవీ షోస్ వంటివి సరేసరి. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వాటన్నింటినీ డామినేట్ చేస్తుంది. సోషల్ మీడియాల్లో ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే తారలకు అంత ఆదాయం. అందుకే తమ అప్ డేట్స్ తో పాటు, ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎర వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అందాల ఆరబోతతో ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది. పెళ్ళైనా కూడా ఆందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు సమంత. ఆమెకు ఇన్ స్టాలో 18మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇలా దాదాపు 2కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్న సమంతను వెతుక్కుంటూ బ్రాండ్ ప్రమోటర్స్ వస్తున్నారు. దీంతో ప్రచారం కోసం డిమాండ్ కి తగ్గట్లే వసూలు చేస్తోంది సమంత.
సమంత ఒక్కొ బ్రాండ్ కి 25లక్షల నుంచి 30లక్షల వరకూ వసూలు చేస్తోందట. ఒక్కో పోస్టింగ్ కి సమంత అందుకుంటున్న మొత్తం అది. ఈ లెక్కన నెలవారి ఆదాయం సినిమాల ఆదాయానికి మించే ఉంటుంది. ఇక దీనికి తోడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. అందుకు ఉదాహరణ అమెజాన్ ప్రైమ్ వారి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’. ఇందులో నటించినందుకు సమంత భారీమొత్తాన్ని అందుకుంది. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకుంది. ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ కు ఉత్తరాదిలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నటిగా ఆమె స్థాయి మరింత పెరిగింది.
 
నా కలను నిజం చేసేశారు!… సమంత ఎంతో ఇష్టపడి చేసిన ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సమంతకు ఘనంగా వీడ్కోలు పలికారు. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంపై సమంత స్పందించింది …
“సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం నా జీవితాంతం గుర్తుండిపోతోంది. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి పురాణగాథలను వింటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఏం మారలేదు. ఇప్పటికీ ఆ కథలంటే ఇష్టం. ఇక గుణ శేఖర్ గారు నాకు గాడ్ ఫాదర్‌లా అయిపోయారు. నా కలను నిజం చేసేశారు. తను నాకు ఈ కథను చెప్పినప్పుడే ఓ కొత్త ప్రపంచాన్ని చూసేశాను. శాకుంతలం ప్రపంచాన్ని ముందే చూసేశాను. అలాంటి ప్రపంచం ఇంకెక్కడా లేనట్టు అనిపించింది. కానీ నేను ఆ సమయంలో ఎంత భయపడ్డాను. ఆ ప్రపంచానికి తగ్గట్టుగా నేను నటిస్తానా? లేనా? అని భయమేసింది.
కానీ ఈ రోజు మొత్తానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. గుణ శేఖర్ సర్‌ మీద నాకు అంతులేని ప్రేమాభిమానాలు, గౌరవం ఏర్పడ్డాయి. నా ఊహకందని ప్రపంచాన్ని ఆయన నిర్మించేశారు. ఇప్పుడు నాలో ఉన్న ఆ పసితనం, ఆ చిన్నపిల్ల ఎంతో సంబరంతో డ్యాన్సులు వేస్తోంది. థ్యాంక్యూ సర్” అని సమంత ఎమోషనల్ అయ్యింది.
 
S అక్షరం అసలు విషయం… సమంత సోషల్ మీడియాలో అనూహ్యంగా తన పేరు నుంచి ‘అక్కినేని’ తొలగింపు తో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.అక్కినేని కుటుంబంలో సమంత ఉండలేకపోతున్నదని, ఆమె కాపురంలో ఏవో కలతలు చోటుచేసుకొన్నాయని ,అందుకనే తన పేరు నుంచి అక్కినేని పదాన్ని తొలగించింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఆమె సన్నిహితులు ఈ రూమర్ల ను తేలికగా కొట్టిపడేస్తున్నారు. సమంత అక్కినేని పదం తొలగించి ఆ ప్లేస్‌లో S అనే అక్షరం పెట్డడం వెనుక అసలు విషయం ఇదీ అంటూ.. కొందరు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె నటిస్తున్న’శాకుంతలం’ సినిమా తన మనసుకు బాగా నచ్చడంతో అలా S అక్షరాన్ని పెట్టుకొందని అయినా సమంత అసలు విషయం బయటపెడితే గానీ S అక్షరం వెనుక రహస్యం బయటపడదంటున్నారు.