హనీమూన్ పూర్తి … షూటింగ్‌లు మొదలు !

పెళ్లి కారణంగా షూటింగ్‌లకు విరామం చెప్పిన సమంత ఓ తమిళ సినిమాతో మళ్లీ యాక్షన్ షురూ చేసింది. అక్కినేని నాగచైతన్యతో గత కొంత కాలంగా ప్రేమలో వున్న సమంత ఇటీవలే అతన్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానంతరం హనీమూన్ కోసం లండన్ వెళ్లిన ఈ జంట ఇటీవలే తిరిగి వచ్చింది.  విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే చెన్నైలో మొదలైంది. చెన్నైలో నిత్యం రద్దీగా వుండే రిచీ స్ట్రీట్, మౌంట్ రోడ్‌లో భారీ క్రౌడ్ మధ్య విశాల్, సమంత పాల్గొనగా దర్శకుడు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘తుప్పరివాలన్’ సినిమాతో సమాంతరంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని తొలుత విశాల్ భావించాడట. కానీ పెళ్లి కారణంగా సమంత, నడిగర్ సంఘం కార్యకలాపాల కారణంగా విశాల్ బిజీగా వుండటంతో ‘ఇరుంబు తిరై’ చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చిందని తమిళ చిత్ర వర్గాల సమాచారం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో అర్జున్ కీలక పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు .  దీనితో పాటు రామ్ చరణ్ ‘రంగస్థలం’, ‘మహానటి’  చిత్రాలు కూడా సమంత రాక కోసం ఎదురు చూస్తున్నాయి .

12న నాగచైతన్య, సమంతల గ్రాండ్‌ రిసెప్షన్‌

నాగచైతన్య, సమంతలు త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌కు ప్లాన్‌ చేస్తోంది. పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట స్నేహితులు ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌ ను నిర్వహించనుంది. ఇప్పటికే చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్‌ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు.ఇప్పుడు హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు అక్కినేని కుటుంబం​ గ్రాండ్‌ గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్‌ ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట తిరిగి షూటింగ్‌లకు హజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.