స‌మంత `ఓ బేబి` ఫ‌స్ట్ లుక్‌ వచ్చింది !

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్టీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ వంటి నాటి అగ్ర క‌థానాయ‌కుల నుండి నేటి యువ స్టార్స్ వ‌ర‌కు సినిమాల‌ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాదితో 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న `ఓ బేబి` సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.
పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోస్తూ సినిమా స‌క్సెస్‌లో కీల‌క భూమిక పోషిస్తున్న అగ్ర క‌థానాయిక స‌మంత అక్కినేని. ఓ బేబి చిత్రంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించారు. ఈమెతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. `ఓబేబి` ఫ‌స్ట్ లుక్‌లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని బి.వి.నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
న‌టీన‌టులు:
స‌మంత అక్కినేని,ల‌క్ష్మి
రావు ర‌మేష్‌,రాజేంద్ర‌ప్ర‌సాద్‌
ప్ర‌గ‌తి త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్
నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌
స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌
మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌,కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్,డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ,ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌,ఆర్ట్‌: విఠ‌ల్‌.కె