సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ నగదు పురస్కారాలు

విజయవాడ-అమరావతి సాంస్కృతిక కేంద్రం లో ఏప్రిల్ 24 న  ‘సాంస్కృతిక బంధు’ సారిపల్లికొండలరావు ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ జానపదకళాకారులకు రెండవ విడత  నగదు పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముఖ్య అతిథి గా  మండలి బుద్ధప్రసాద్, సభాధ్యక్షులు గా డా.డి.విజయభాస్కర్, సభాప్రారంభకులుగా గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక బంధు సారిపల్లికొండలరావు, డా.ఈమని శివనాగిరెడ్డి, దీక్షిత్ మాస్టారు, డోగిపర్తిశంకరరావు, వై .కె. నాగేశ్వర రావు పాల్గొన్నారు.

జానపదకళాకారులు కుంపటి కోటేశు(డప్పులు),కత్తి నాగులు(పిచ్చిక గుంట్లు), యడవల్లి నారాయణ(జానపద గీతాలు), పి.రమణయ్య(హరికథ), పిన్నింటి తవుడు(పిచ్చిక గూళ్ళు), పసుపులేటి వెంకటనారాయణ(గరగలు), శ్రీమతి కె.అనురాధ,  పి.గోపి, యం.సంగీతరావులు (నాటకం) ఒక్కొక్కరు పదివేలనగదుపురస్కారాలు అందుకున్నారు.కార్యక్రమంలో కుమారి సౌజన్య గీతాలాపన చేయగా సిల్వెస్టర్ మిమిక్రీ ప్రదర్శించారు.