విశాఖలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన సంయుక్త

 ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ‌ విశాఖపట్నంలో తన నూత‌న‌ బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్  సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు.
సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌జ‌ల‌కు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప‌రిచ‌యం చేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంది.
నేను కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాల‌జీ లేదు. హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవ‌ల ట్రెక్కింగ్ కోసం మేఘాల‌యా వెళ్లాను. ఆ జ‌ర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ స‌మ‌స్య కూడా లేదు. కానీ అక్క‌డ కొంత మందిలో స‌రిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌లేదు. ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌దేశాల‌ను చూడాలి, ప్ర‌కృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌గా ఉండాలలి అస‌ర‌మైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.  నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు అభినందనలు. దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న కలర్స్ హెల్త్ కేర్.. ఇప్పుడు విశాఖ ప్ర‌జ‌ల చెంత‌కు రావ‌డం ఆనందంగా ఉంది” అని అన్నారు.
‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ – “2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సంతృప్తి పరిచింది. ఆధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. మెడిక‌ల్ కండీష‌న్, ఇంజెక్ష‌న్స్, హెల్త్ పౌడ‌ర్ వంటివి అందించే సేవల‌తో కలర్స్ హెల్త్ కేర్ 2.Oగా అప్‌డేట్ అయింది. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్‌ను ప్రారంభించాము. ” అని తెలిపారు.
ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ మాట్లాడుతూ – “21 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసం, సంతృప్తి మాకు మ‌రింతా కాన్ఫిడెన్స్ పెంచింది. వారి అభిలాష మేరకు విశాఖలో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యుఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం” అని వివరించారు.
మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ – “కలర్స్ హెల్త్ కేర్ సేవలను విశాఖపట్నానికి విస్తరించగలగడం ఆనందంగా ఉంది. ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన సంయుక్త మీనన్‌కు ధన్యవాదాలు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి కోరికకు మద్దతుగా కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ నిలుస్తుంది” అని అన్నారు.
5M మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో  పలువురు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.