‘ప్రాచీన కళా కేంద్ర’ తో కలసి ‘సంచలన’ కళాసేవ

‘ప్రాచీన కళా కేంద్ర’ చండీగఢ్ వారి సేవలను దక్షిణాదిన విస్తరించాలని, వారి కార్యక్రమాల విశేషాలు వివరించడం కోసం ‘న్యూస్ సర్వీస్ సిండికేట్’ NSS లో ‘సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్’ వారితో కలసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సమావేశంలో ‘ప్రాచీన కళా కేంద్ర’ వ్యవస్థాపక సభ్యురాలు, రిజిస్ట్రార్, ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు గ్రహీత డా.శోభా కోసర్, ‘ప్రాచీన కళా కేంద్రం’ కార్యదర్శి సజల్ కోసర్, ‘సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపకురాలు’ ప్రముఖ కూచిపూడి నృత్య గురువు శ్రీమతి పద్మాకళ్యాణ్, ‘యువ కళా వాహిని’ అధ్యక్షులు, లయన్ వై కె నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
‘సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్’ వారి కళా సేవలు
శ్రీమతి పద్మా కళ్మాణ్ 1983 నుండి నిర్వహిస్తున్న ‘అనసూయ ఆర్ట్స్ అకాడమీ’ 2005లో ‘సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్’ గా రూపాంతరం చెందింది. ఇప్పటికి 35 సం.నుండి 2000 మందికి పైగా నృత్య శిక్షణ ఇచ్చారు. వారు తెలుగు యూనివర్సిటీ ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులై గురువులుగా రాణిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ..విదేశాలలో తమ కళా సేవలు కొనసాగిస్తున్నారు.
 
తమ సంస్థ సేవలను విస్తరించాలని…’ప్రాచీన కళాకేంద్ర’ చండీఘర్ వారితో కలసి 2012 నుండి నృత్యం,సంగీతం,చిత్ర లేఖనం విభాగాల్లో జూ.డిప్లమో ,సీ.డిప్లమో …విశారద,భాస్కర పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 24 కేంద్రాల్లో ప్రముఖ విద్వాంసుల ద్వారా ఈ పరీక్షలను జరుపుతున్నారు.’బాలోత్సవం’ ‘యువోత్సవం’ నిర్వహిస్తున్నారు. తద్వారా ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, యువతలో మన కళల పట్ల ఆసక్తి కలిగించాలనేదే తమ లక్ష్యమని శ్రీమతి పద్మాకళ్యాణ్ చెప్పారు.