సందీప్ మాధ‌వ్‌ `గంధ‌ర్వ‌` జూలై 1న విడుద‌ల !

ఎస్‌.కె. ఫిలిమ్స్  అధినేత సురేష్‌కొండేటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ల‌తో `గంధ‌ర్వ‌`చిత్రం లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల, సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మం జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర హీరో సందీప్ మాధ‌వ్‌, సాయికుమార్‌, బాబూమోహ‌న్, చిత్ర నిర్మాత స‌బాని, ద‌ర్శ‌కుడు అప్స‌ర్, సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `గంధ‌ర్వ‌`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై ఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. ఈ సంద‌ర్భంగా గంధ‌ర్వ చిత్ర పోస్ట‌ర్‌ను బాబూమోహ‌న్ ఆవిష్క‌రించ‌గా, జులై1న విడుద‌ల‌చేస్తున్న‌ట్లు ఛిత్ర హీరో సందీప్ మాధ‌వ్ ప్ర‌క‌టించారు. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు.
జ‌ర్న‌లిస్టు, పంపిణీదారుడు, నిర్మాత, సంతోషం సినీవార‌ప్ర‌తిక ప‌బ్లిష‌ర్‌, ఎస్‌.కె. పిక్చ‌ర్స్ అధినేత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ…  గంధ‌ర్వ ద‌ర్శ‌కుడు అప్స‌ర్ డెడికేష‌న్ బాగా న‌చ్చింది. ఆయ‌న తీసే విధానం న‌చ్చి ఈ సినిమా నేను విడుద‌ల‌చేయాల‌ని ఫిక్స్ అయ్యాను. నేను సినిమా తొలికాపీ చూశాను. నా అబ్జ‌ర్‌వేష‌న్‌లో నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక ఇందులో వున్న కొత్త‌పాయింట్ ఏ ఒక్క సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. ఇంత గొప్ప‌పాయింట్ ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. ఇప్ప‌టికైనా ఛాలెంజ్‌. ఇంత‌వ‌ర‌కు రాని గొప్ప పాయింట్ ఇందులో వుంది. న‌న్ను న‌మ్మి ఈ సినిమాను నాకు ఇచ్చారు. చాలా బాధ్య‌త‌తో తీసుకున్నా. జులై 1న సినిమా విడుద‌ల‌వుతుంది. మా గంధ‌ర్వ సినిమాకు టికెట్ రేటు పెంచ‌కుండానే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రేట్ల‌తోనే ప్రేక్ష‌కుల‌కు ప్ర‌ద‌ర్శిస్తున్నాం. ఇక సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ డెడికేష‌న్ లాయర్ సాబ్  కవర్ ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌టైంలో చూశాను. ఆయ‌న మ‌రో దేవీశ్రీ‌ప్ర‌సాద్ అవుతాడ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను.  నేను ఘంటాప‌దంగా చెబుతున్నాను ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. ఇంత‌కుముందు నా సినిమాలు ప్రేమిస్తే నుంచి ప్ర‌తీదీ హిట్ అయ్యాయి. ఇక సాయికుమార్‌గారు ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత అంత‌మంచి పాత్ర గంద‌ర్వ‌లో చేశారు. అదేవిధంగా బాబూమోహ‌న్‌గారి స‌పోర్ట్ నేను తొలి రోజుల్లో జ‌ర్న‌లిస్టుగా వున్న‌ప్ప‌టినుంచీ అదే ప్రేమ‌, ఆప్యాయ‌త‌, గౌర‌వం క‌నిపిస్తుంది. హీరో శాండీ (సందీప్‌) వంగ‌వీటి, జార్జిరెడ్డి వంటి  సినిమాలు చేశాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న 10కోట్ల హీరో. కానీ ఎందుకింత గేప్ తీసుకున్నారు అనిపించేది. నాకు ఈ సినిమా చూశాక అర్థ‌మ‌యింది ఏమంటే, ఈయ‌న‌కు కథ బాగా న‌చ్చితేనే సినిమా చేస్తాడ‌ని. ఆయ‌న‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. మా బేన‌ర్ ద్వారా మ‌రో మంచి సినిమాకు అవ‌కాశం ఇచ్చిన నిర్మాత స‌బానిగారికీ, వారి కుటుంబానికి రుణ‌పండి వుంటాన‌ని తెలిపారు.
హీరో సందీప్ మాధ‌వ్ మాట్లాడుతూ…  ఇంత‌కుముందు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేశాను. గంధ‌ర్వ ఫిక్ష‌న్ పాయింట్‌. ఎందుకు, ఏమిటి? ఎలా జ‌రుగుతుంది? అనే ఆస‌క్తిక‌ర‌మై క‌థ‌తో నిర్మాత స‌బాని గారు కొత్త ద‌ర్శ‌కుడు అప్స‌ర్‌తో బ‌డ్జెట్‌కు వెనుకాడ‌కుండా నిర్మించారు. సాయికుమార్‌, బాబూమోహ‌న్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. వీర‌శంక‌ర్‌గారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు. ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతాన్ని బాగా స‌మ‌కూర్చాడు. సురేష్‌కొండేటిగారు ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌డంతో మా సినిమా స్థాయి పెరిగింది. ద‌ర్శ‌కుడు అప్స‌ర్ రాసుకున్న డైలాగ్స్‌, ఎమోష‌న్స్ బాగా పండాయి. ఈ చిత్రానికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రినీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ మాట్లాడుతూ… ఇది డ్రీమ్ నా ప్రాజెక్ట్‌. ఈ క‌థ విన్నాక నాకు అనిపించిన ఫీలింగ్. ద‌ర్శ‌కుడు అప్స‌ర్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. సురేష్‌కొండేటిగారు ప్రివ్యూ  చూశాక ఇంకా ఎవ‌రికీ సినిమా చూపించొద్దు. ఇది నేను రిలీజ్ చేస్తాన‌ని అన్నారు. ఆయ‌న ముక్కుసూటి మ‌నిషి ఆయ‌న జ‌డ్జిమెంట్ క‌రెక్ట్‌గా వుంటుంది. ఆయ‌న రాక‌తో మా సినిమా స్థాయి పెరిగింది. కెమెరామెన్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, నిర్మాత‌, ఎడిట‌ర్ ఇలా ప్ర‌తి ఒక్క‌రూ మంచి సినిమా తీశామ‌నే ఫీలింగ్‌తో వున్నాం. మా టీమ్ సంగీతం బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. హీరో శాండీ, నాకో చ‌రిత్ర వుండాల‌నే సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంటాడు. జార్జిరెడ్డి త‌ర్వాత పెద్ద ఆఫ‌ర్లు తీసుకువ‌చ్చాను. అయినా ఆయ‌న టెంప్ట్ కాలేదు. ఆయ‌ను న‌చ్చితేనే సినిమా చేస్తాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుల టీమ్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. న‌టీన‌టులు బాగా స‌హ‌క‌రించార‌ని చెప్పారు.
నిర్మాత స‌బాని మాట్లాడుతూ.. మా త‌మ్ముడు అప్స‌ర్ ఓ మూవీ వుంది. న‌న్ను న‌మ్మి పెట్టుబ‌డి పెట్ట‌మ‌న్నాడు. మూవీ పూర్త‌యింది. చూశాక చాలా బాగా తీశాడు అనిపించింది. పాండ‌మిక్‌ల‌ను ఎదుర్కొంటూ స‌మ్మ‌ర్‌ను తట్టుకుని చేసిన సినిమా ఇదిఅని తెలిపారు.
చిత్ర ద‌ర్శ‌కుడు అప్స‌ర్ మాట్లాడుతూ…  గంధ‌ర్వ మొద‌టి ప్రివ్యూతోనే బిజినెస్ అయింది. ఇందుకు ష‌కీల్‌, సందీప్ కార‌ణం. మా గురువుగారు వీర‌శంక‌ర్ మంచి స‌ల‌హాలు ఇవ్వ‌డం జ‌రిగింది.ప్ర‌భాస్ తొలి చిత్రానికి ప‌నిచేసిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి మా సినిమాకు ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అంద‌రూ స‌హ‌క‌రించారు. ప్ర‌తివారూ చూడాల్సిన సినిమా అని చెప్పారు.
ఇంకా స‌మ్మెట గాంధీ, పాల్‌, సూర్య (పింగ్‌పాంగ్‌), కెమెరామెన్ జ‌వ‌హ‌ర్రెడ్డి, రూపాల‌క్ష్మి, జ‌య‌రాం,  మ‌ధు త‌దిత‌రులు మాట్లాడారు.