మహారాణి నీ ప్రేమిస్తున్నా… డాక్టర్ నీ ప్రేమిస్తున్నా!

‘బెంగుళూరు బ్యూటీ’ సంజన… “స్వర్ణ ఖడ్గం’ లో యోధురాలైన మహారాణి పాత్రను ప్రేమిస్తున్నా ….

అలాగే,మొదటి చూపులోనే ప్రేమలో పడేసిన డాక్టర్ నీ ప్రేమిస్తున్నా” అని అంటోంది.
ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాతో సెకండ్ హీరోయిన్‌గా తెలుగులో కెరీర్ ప్రారంభించి… హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే మంచి క్యారెక్టర్ పడకపోవడం కూడా కారణం అయుండొచ్చు.  సంజన ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా కొనసాగుతూనే, బుల్లితెర మీద మెరవడానికి సిద్ధమైంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనకంటూ ఓ ముద్ర వేయగలిగింది సంజన. నటనతో పాటు వ్యాపారంలోనూ మంచి పట్టు ఉన్న సంజన మాట్లాడుతూ…‘‘నా కెరీర్లో ఇప్పటి వరకు 45 సినిమాల్లో నటించాను. స్టార్లతో కలిసి చేశాను. పదేళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇటీవలే సైన్ చేశాను. ప్రస్తుతం ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్‌లో చేస్తున్నాను.  ఇండియన్ టెలివిజన్ చరిత్రలో భారీ బడ్జెట్‌తో తీస్తున్న షో. ముప్పైనిమిషాలు  ఎపిసోడ్ కోసం 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. అని సంజన చెప్పింది.
‘స్వర్ణ ఖడ్గం’ లో యోధురాలైన మహారాణి పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర గురించి సింపుల్‌గా చెప్పాలంటే ‘బాహుబలి’ ప్రభాస్‌ను ఫిమేల్ గా చూపించడం లాంటిది . అంత హెవీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వస్తోంది …అని సంజన చెప్పింది.

మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా !
సంజన తాజాగా  ఓ ఇంటర్య్వూలో… ‘తను ప్రేమలో ఉన్నానని, ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాన’ని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పేసింది. మీరు ప్రేమలో పడ్డారంట కదా.. అని అందరూ అడుగుతున్నారు. అవును, నిజంగానే నేను ప్రేమలో పడిపోయాను. ఆయన ఓ డాక్టర్. ఓ హాస్పిటల్‌లో నిర్వహించిన హెల్త్ క్యాంపుకి నేనూ వెళ్లాను. అక్కడ ఆయన పరిచయమయ్యారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మా ఇంట్లో కూడా తెలుసు. అయితే  వివరాలు అడగవద్దు. అవి మాత్రం ఇప్పుడు చెప్పను. అవి రహస్యంగా ఉంచాలనుకుంటున్నా.  అయినా ఆయన గురించి ఇప్పుడవసరమా?  నేను లవ్‌లో ఉన్నానని చెబుతున్నాను కదా.. ఇంక వివరాలెందుకు.. ఇక పెళ్లంటారా? దానికి చాలా సమయముంది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి. ఆ తర్వాతే పెళ్లి. ఈ విషయం మా డాక్టర్ గారికి ముందే చెప్పాను. దానికి ఆయన అంగీకరించారు కూడా…’’ అంటూ చెప్పింది.

టీవీ సీరియల్స్ చేస్తున్నంత మాత్రాన సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టను. వాటి దారి వాటిదే. వీటి దారి వీటిదే. సినిమాల్లో  గుర్తింపు తెచ్చే మంచి క్యారెక్టర్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను…అని సంజన అంటోంది