ఆత్మ కధ రాసే పనిలో బిజీగా ‘సంజు’

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొన్న బయోపిక్‌ ‘సంజు’లో ఆయన గురించి చాలా వివరాలు ఉన్నాయి. అయినా సంజయ్‌దత్‌ ఇప్పుడు ఆత్మకథ రాసే పనిలో బిజీగా ఉన్నారు. మున్నాభాయ్‌ డ్రగ్స్‌ తీసుకోవడం, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లి రావడం … ఇలా అన్ని విషయాలూ బయోపిక్‌ ‘సంజు’లో చూపించేసిన తర్వాత, ఇక కొత్తగా ఆత్మకథలో ఆయన చెప్పేదేముంది ? అని అనుకొంటే మీరు పొరపడినట్లే….
 
‘నా జీవితం పడి లేచిన కెరటంలాంటిది. కష్టాలు, సుఖాలూ అన్నీ అనుభవించాను. పడ్డాను , మళ్లీ లేచాను. నా జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటివరకూ వాటి గురించి ఎవరితోనూ చెప్పే అవకాశం నాకు రాలేదు. నా జ్ఞాపకాలు, ఎమోషన్స్‌ పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు సంజయ్‌దత్‌.
సో అందుకే ఆయన ఆత్మకథ మొదలుపెట్టారన్నమాట. ఈ పుస్తకానికి ఇంకా పేరు పెట్ట లేదు. వచ్చే ఏడాది సంజయ్‌ 60వ పుట్టినరోజు జూలై 29న ఈ పుస్తకాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు . ఇదిలా ఉండగా.. సంజయ్‌ బయోపిక్‌ ‘సంజు’ రికార్డ్‌ కలెక్షన్లతో రూ. 300 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతూ బాలీవుడ్ లో సంచలనం రేకెత్తిస్తోంది.
పగ తీర్చుకోవడానికీ వెనకాడేవాడు కాదు
సంజయ్‌ దత్‌ ఓ ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అందరి మనసుల్లో ఒకటే అనుమానం…ఏం చూసి ఈ ‘ఖల్‌నాయక్‌’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా? అని. ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్‌ కుమార్‌ హీరానీ వారి  సందేహాలు ఇలా తీర్చారు…
 
సంజయ్‌ దత్‌ పరిచయం అయిన ప్రతి అమ్మాయిని ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్‌ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే… ఆ సమాధి సంజయ్‌ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్‌ హీరానీ.
 
‘సంజు’ తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట.ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్‌ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్‌ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్‌ చేసి ఉంది. సంజయ్‌ ఆ కారును తుక్కు చేశాడంట. ఆ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్‌ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్‌ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు