సంక్రాంతికి అన్న‌పూర్ణ సంస్థ పొంగ‌ళి `రంగుల‌రాట్నం`

2017లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘హలో’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌. తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా, చిత్ర శుక్లా హీరోయిన్‌గా తెర‌కెక్కించిన చిత్రం `రంగుల‌రాట్నం`.  శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.  చేస్తూ జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.
నాగార్జున మాట్లాడుతూ “అంద‌రికీ హ్యాపీ న్యూ ఇయ‌ర్‌. సంక్రాంతి శుభాకాంక్ష‌లు. `రంగుల రాట్నం` చిత్రాన్ని మా అన్న‌పూర్ణ వాళ్లు వ‌డ్డించే సంక్రాంతి పొంగ‌ళి అని మేం అనుకుంటున్నాం. నేను సినిమా చూశాను. మా సినిమా ఇది. బొబ్బ‌ట్టులాగా ఉంటుంది. చాలా తీపిగా, చాలా బావుంటుంది. ఒక రియ‌ల్ ఫిల్మ్ ఇది. రియ‌ల్ అంశాల‌తో తీసిన సినిమా. త‌ల్లీకొడుకుల మ‌ధ్య ఎమోష‌న్స్, ఒక కుర్రాడికి, అత‌నికి కాబోయే భార్య‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను చూస్తుంటే నా క‌ళ్ల ముందే పాత్ర‌ల‌న్నీ క‌దులుతున్న‌ట్టు అనిపించింది. ల‌క్కీగా నాకు సంక్రాంతికి డేట్ దొరికింది. సినిమాను నెల రోజుల క్రిత‌మే రెడీ చేసి పెట్టాం. సంక్రాంతికి ల‌క్కీగా డేట్ దొరికేస‌రికి ఫ్రీజ్ చేశాం.  ఫ్యామిలీస్ అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. న‌వ్వుకుంటూ, అప్పుడ‌ప్పుడూ కొంచెం కంట‌త‌డి పెడుతూ ప్రేక్ష‌కులు చూస్తారు.  నాకు ఈ  సినిమా క‌థ ఏడాది క్రితం చెప్పారు. ఏడాదిలో ఇంకో వంద క‌థ‌లు వినుంటాను. అప్పుడు విని బావుంది ఈ క‌థ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సుప్రియ‌కి చెప్పాను. చేయొచ్చు అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాను. అయితే ఆ త‌ర్వాత క‌థ‌ని మ‌ర్చిపోయాను. రీసెంట్‌గా  సినిమాను ప్రేక్ష‌కుడిగానే చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. ప్రెసెంట్ స‌ర్‌ప్రైజ్‌లాగా అనిపించింది. లెంగ్త్ లు కాస్త ఎక్కువైతే త‌గ్గించ‌మ‌ని చెప్పాను. అంత‌వ‌ర‌కే నేను ఇందులో పాల్గొన్న‌ది. ఏదేమైనా మా సంస్థ‌కు చాలా మంచి పేరు వ‌స్తుంది. ఎవ‌రు ఏం చేసినా క్రెడిట్ నాకే ద‌క్కుతుంది కాబ‌ట్టి నాకు చాలా హ్యాపీ. శ్రీరంజ‌నికి ద‌ర్శ‌కురాలిగా తొలి చిత్ర‌మిది. ఎలా నెరేట్ చేసిందో అప్పుడు గుర్తులేదు. కానీ సినిమాను ఎక్స్ పీరియ‌న్స్ గ‌ల డైర‌క్ట‌ర్‌గా బాగా తెర‌కెక్కించింది.   మ‌ద‌ర్ ఎమోష‌న్స్, అమ్మాయి ఎమోష‌న్స్ ని ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించింది. మేం రాజ్‌త‌రుణ్‌తో `ఉయ్యాల జంపాల` చేశాం. త‌ను నేచుర‌ల్ యాక్టర్‌. చాలా బాగా చేస్తాడు. ఒక సీన్‌లో త‌ల్లిని ప్రేమించే అబ్బాయిలాగా బిత్త‌ర‌చూపుల‌తో చేశాడు. నాకు ర‌క‌ర‌కాల విష‌యాలు గుర్తొచ్చాయి. అత‌ని యాస ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. మా నాయిక చిత్ర సినిమాలోనూ చాలా అందంగా ఉంది. సినిమాలో అంద‌రూ రియ‌ల్‌గా ఉన్నారు. అదే నాకు చాలా బాగా న‌చ్చింది. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రియ‌ద‌ర్శి చాలా బాగా చేశాడు. త‌ను ఈ సినిమాకు పెద్ద హైలైట్ అవుతాడు. నేచుర‌ల్ టైమింగ్‌, నేచుర‌ల్ కామెడీ ఉన్న సినిమా ఇది. సితార‌గారు త‌ల్లి పాత్ర‌లో చాలా బాగా చేశారు. సితార‌కు, రాజ్‌త‌రుణ్‌కి మధ్య ఉన్న త‌ల్లీ కొడుకుల రిలేష‌న్ షిప్ చాలా బాగా పండింది.  ఆమె చాలా చ‌క్క‌గా డ‌బ్బింగ్ కూడా చెప్పారు. ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ కి డ‌బ్బింగ్ చాలా బాగా కుదిరింది. ఈ సంక్రాంతికి స్వీట్ ల‌వ్లీ ఫిల్మ్ అవుతుంది. `రంగుల‌రాట్నం`లాగా చ‌క్క‌గా, హాయిగా చూడొచ్చు“ అని చెప్పారు.
దర్శకురాలు శ్రీరంజని మాట్లాడుతూ – ”నన్ను, నా కథని నమ్మి ఈ చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి నా కృతజ్ఞతలు. నాగార్జునగారు కథ విని చాలా బాగుంది ఈ సినిమా మనం చేస్తున్నాం అనగానే నాలో కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. రెండు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేశాం. డైరెక్టర్‌ అంటే నాకు ప్యాషన్‌, యాంబిషన్‌. ఫొటోగ్రాఫర్‌ మది, ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌ కథ విని ఇంప్రెస్‌ అయి అన్నపూర్ణ స్టూడియోస్‌కి పంపించారు. సుప్రియ స్క్రిప్ట్‌ విని ఓకే చేశారు. మేకింగ్‌ విషయంలో సుప్రియగారు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రసాద్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. టీం అందరి సహకారంతో మంచి సినిమా తీయగలిగాను. అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి బిగ్‌ బేనర్‌ ద్వారా డైరెక్టర్‌గా లాంచింగ్‌ అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జునగారికి నేను బిగ్‌ ఫ్యాన్‌ని. కథ వినేటప్పుడు ఆయన ఎక్స్‌ప్రెషన్‌ చూసి చాలా భయపడ్డాను. సినిమా చూశాక వెరీ స్వీట్‌ అండ్‌ నైస్‌ ఫిలిం అని చెప్పగానే చాలా ధైర్యం వచ్చింది. రాజ్‌తరుణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఫెంటాస్టిక్‌గా చేశాడు. చిత్ర కీర్తి క్యారెక్టర్‌లో బ్యూటిఫుల్‌గా నటించింది. మదర్‌ క్యారెక్టర్‌లో సితార అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించారు. రెగ్యులర్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కాకుండా త్రూ ఔట్‌ హీరోకి సపోర్టింగ్‌ క్యారెక్టర్‌లో ప్రియదర్శి నటించాడు. శ్రీచరణ్‌ వండ్రఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. రీరికార్డింగ్‌ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ఎసెట్‌ అవుతుంది. ‘రంగులరాట్నం’ స్వీట్‌ అండ్‌ క్యూట్‌ లవ్‌స్టోరి. ఇట్స్‌ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌. సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది” అన్నారు.
హీరో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా పోస్టర్స్‌ రిలీజ్‌ అయినప్పటి నుండి ఇప్పటివరకు సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘ఉయ్యాలా జంపాలా’ తర్వాత మళ్లీ ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ సంస్థలో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా వుంటుంది. కష్టపడుతున్నట్లుగా లేదు. చాలా ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేశా. డైరెక్టర్‌ శ్రీరంజని తనకేం కావాలో స్పష్టంగా తెల్సు. ఆర్టిస్ట్‌లందరి నుండి ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నారు. ప్రియదర్శి కామెడీ టైమింగ్‌ చాలా బాగుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ చాలా ఫన్నీగా వుంటాయి. శ్రీచరణ్‌ మంచి ఆడియో ఇచ్చారు. తన రీరికార్డింగ్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాడు. సితారగారు నాకు మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. షూటింగ్‌ చేసేటప్పుడే చాలా ఎంజాయ్‌ చేశాను. ఇప్పుడు సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. రెండు గంటల పాటు అందరూ చూసి ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది” అన్నారు.
ప్రముఖ నటి సితార మాట్లాడుతూ – ”ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగారితో చాలా సినిమాల్లో కలిసి నటించాను. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలో పని చేయడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్‌ చేస్తారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ శ్రీరంజనికి నా థాంక్స్‌. అన్నీ వర్గాల ఏజ్‌ గ్రూప్‌ వాళ్లకి నచ్చే సినిమా ఇది. చాలా రియలిస్టిక్‌గా వుంటుంది. ఎంతో ఇన్‌స్పైర్‌ అయి నా క్యారెక్టర్‌కి నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పాను. ఒక ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సంక్రాంతి సినిమా వస్తుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సుప్రియగారికి, ప్రసాద్‌గారికి నా థాంక్స్‌” అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకల మాట్లాడుతూ – ”క్షణం’, ‘గరుడవేగ’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆ రెండు చిత్రాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు. నా మనసుకి చాలా దగ్గరైన సినిమా. వెరీ క్యూట్‌ అండ్‌ స్వీట్‌ ఫిలిం. కొత్త ఎక్స్‌పెరిమెంట్‌తో ఈ సినిమా మ్యూజిక్‌ చేశాను. ఈ చిత్రంలో నేను ఒక పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది” అన్నారు.
హీరోయిన్‌ చిత్ర శుక్లా మాట్లాడుతూ – ”మా ఫ్యామిలీ మెంబర్స్‌, నా ఫ్రెండ్స్‌ చాలామంది నాగార్జునగారికి అభిమానులం. అలాంటి ఆయన నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీరంజని ఎంతో ప్యాషన్‌ వున్న డైరెక్టర్‌. హీరోయిన్‌గా కంటే ఒక యాక్ట్రెస్‌గా మంచి పాత్రలో నటించాను. చాలా అద్భుతమైన కథ. నిజ జీవితంలో జరిగే క్యారెక్టర్స్‌ అన్నీ ఈ చిత్రంలో వుంటాయి. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి వర్క్‌ చేశారు. విజయ్‌ ఫొటోగ్రఫీ, శ్రీకర ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకి ఎంతో ప్లస్‌ అవుతాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్‌గా వుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సుప్రియగారికి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రసాద్‌కి నా థాంక్స్‌” అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ – ”టైటిల్‌ తగ్గట్లుగా ఈ సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఈ సినిమా జర్నీలో ఎంతో నేర్చుకున్నాను. ఫ్యామిలీ ఎమోషన్‌ సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. రాజ్‌తరుణ్‌తో త్రూ ఔట్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించాను. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుంటాను. ఫస్ట్‌ టైమ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో వర్క్‌ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన సుప్రియగారికి నా ధన్యవాదాలు” అన్నారు.