‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘కామెడీ కింగ్‌’ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చ‌ర‌ణ్ ల‌క్కాకుల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.   బుల్గానిన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ వేదిక మీద ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ని స‌న్మానించారు.

చిత్ర నిర్మాత డా.ర‌వికిర‌ణ్‌ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌క హిట్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు. అంద‌రూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. నా వ‌ర‌కు మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాం. పెద్ద సినిమాకు ఎంత క‌ష్ట‌ప‌డ‌తామో, అంతా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం. మా సినిమా ట్రైల‌ర్లు, పాట‌లు విడుద‌ల చేసిన సెల‌బ్రిటీలు అంద‌రికీ చాలా ధ‌న్య‌వాదాలు.  వాళ్ల వ‌ల్ల మా సినిమాకు చాలా హైప్ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 7న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ గారు అద్భుత‌మైన డైలాగులు రాశారు. వారికి మా ధ‌న్య‌వాదాలు. వాళ్లు లేక‌పోతే మా సినిమా ఇంత బాగా వ‌చ్చేది కాదు. నేటివిటీకి త‌గ్గ‌ట్టు అద్భుతంగా డైలాగులు రాశారు. సినిమాను డిసెంబ‌ర్  7న విడుద‌ల చేస్తున్నాం. ‘స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్’ లాగానే ఈ సినిమాను కూడా హిట్ అవుతుంది“ అని తెలిపారు.

హీరో సప్త‌గిరి మాట్లాడుతూ “గౌత‌మ్‌రాజుగారు ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసి చాలా మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ గారు ఎంద‌రో పెద్ద హీరోల‌కు రాశారు. ఇప్పుడు చిన్న హీరో అయినా నాకు రాసిపెట్టారు. నా నుంచి ప్రేక్ష‌కులు ఎలాంటి డైలాగులు ఇష్ట‌ప‌డ‌తారో, అలాంటి డైలాగుల‌ను నాకు ఇచ్చారు. వాళ్ల‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. సాయికుమార్‌గారు, శివ‌ప్ర‌సాద్ గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర‌లో చేసిన‌ట్టు అనిపిస్తోంది. మా నిర్మాత నా కోస‌మే పుట్టిన‌ట్టు అనిపిస్తోంది. న‌న్ను హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌బెడ‌తాన‌ని ఆయ‌న నాతో అన్నారు. నాతో తీసిన ఇంత‌కు ముందు ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. ఆయ‌న‌కు జీవితాంతం నేను రుణ‌ప‌డి ఉంటాను. ఆయ‌న నా ఫ్రెండ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డే స‌బ్జెక్ట్ లు ఆయ‌న‌కు బాగా తెలుసు. ఈ సినిమాను ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. చాలా గొప్ప సినిమా చేశారు. మంచి విజ‌యం సాధిస్తుంది. మా సంగీత ద‌ర్శ‌కుడికి వంద సినిమాలు చేసే స‌త్తా ఉంది. ఇద్ద‌రం స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా ఇబ్బందులు ప‌డ్డాం. కెమెరామేన్‌కు కూడా  చాలా పేరు వ‌స్తుంది“ అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌ మాట్లాడుతూ “నేను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ గారి ద‌గ్గ‌ర చాలా సినిమాల‌కు ప‌నిచేశాను. న‌న్ను చాలా ఆత్మీయంగా చూసుకున్నారు. వారింట్లో వ్య‌క్తిని నేను. వాళ్ల మ‌న‌సుల‌కు ద‌గ్గ‌రైన వ్య‌క్తుల‌ను మాత్ర‌మే ‘ఏరా’ అని పిలుస్తారు. అలాంటివ్య‌క్తిని నేను. ఆర్థికంగా, హార్దికంగా న‌న్ను బాగా చూసుకున్నారు. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగులు రాయ‌డం చాలా గ్రేట్‌. అద్భుతంగా డైలాగులు రాశారు. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. నిర్మాత ఎక్క‌డా రాజీప‌డ‌కుండా సినిమా చేశారు“ అని చెప్పారు.

సాయికుమార్ మాట్లాడుతూ “గౌత‌మ్‌రాజుగారు, రాధాకృష్ణ ఈ సినిమా చూసి చాలా బాగా వ‌చ్చింద‌ని ఫోన్ చేశారు. ఈ క్రెడిట్ మొత్తం స‌ప్త‌గిరికే ద‌క్కుతుంది. ఈ సినిమాలో యాక్టింగ్ చేయ‌డం క‌న్నా క‌ళ్ల‌తోనే ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చాను. నేను ప‌ది పేజీల డైలాగులు, చెబితే, స‌ప్త‌గిరి 20 పేజీల డైలాగులు చెప్పారు. మా నిర్మాత మంచి డాక్ట‌రే కాదు.. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత‌. నేను, స‌ప్త‌గిరి పోటాపోటీగా న‌టించాం. సినిమాను న‌మ్మ‌కున్న వాళ్ల‌కు క‌ళామ‌తల్లి ఎప్పుడూ ఆశీర్వ‌దిస్తుంది. ఈద‌ర్శ‌కుడిని ఇప్పుడు ఆశీర్వ‌దించింది. ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌జేసేలా ఉంటుంది ఈ సినిమా. కోర్డు డ్రామా స‌న్నివేశాల్లో స‌ప్త‌గిరి చాలా బాగా చేశాడు. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. అత‌నికి చాలా న‌మ్మ‌కం ఎక్కువ‌. అత‌నికి భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా ఉంటుంది. నాకు సామాన్యుడు, ప్ర‌స్థానం త‌ర్వాత ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది“ అని అన్నారు.

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ “స‌ప్త‌గిరి డ్యాన్సులు ఇర‌గ‌దీశాడు. సినిమాల్లో చూస్తుంటే చాలా ఆశ్చ‌ర్య‌మేసింది. ఈ సినిమా విడుద‌ల‌య్యాక చాలా మంది ర‌చ‌యిత‌లు స‌ప్త‌గిరి కోసం కొత్త క‌థ‌లు రాస్తారు. మా తొలి సినిమాకు ఎంత ఆనంద‌ప‌డ్డామో, ఈ సినిమాకూ అంతే ఆనంద‌ప‌డుతున్నాం. రామానాయుడుగారు బ‌తికి ఉంటే ఈ ద‌ర్శ‌కుడికి మొద‌టి అవ‌కాశం ఇచ్చేవారు. అలాగే సూప‌ర్ గుడ్‌లోనూ ఒక సినిమా చేస్తాడ‌ని అనుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. కానీ స‌ప్త‌గిరి, ర‌వికిర‌ణ్‌గారు అవ‌కాశం ఇచ్చారు. స‌ప్త‌గిరి సినిమా ఆడియోకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు రావ‌డం ఏంటా? అని ఆశ్చ‌ర్య‌పోయాను. ఆయ‌న ఆశీస్సుల‌తో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా చూసి పోలీసులు గ‌ర్వ‌ప‌డ్డారు. ఈ సినిమా చూసి లాయ‌ర్లంద‌రూ గ‌ర్వ‌ప‌డ‌తారు. మంచి లీగ‌ల్ పాయింట్ ఉన్న సినిమా. ఈ దేశంలోని ప్ర‌తి రైతు, ప్ర‌తి లాయ‌రూ చూడాల్సిన సినిమా ఇది. సాయికుమార్‌గారి డైలాగులకు త‌ప్ప‌కుండా క్లాప్స్ ప‌డ‌తాయి. చివ‌రి 45 నిమిషాలు ఆక‌ట్టుకుంటాయి“ అని చెప్పారు.

ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ “ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మా కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని చిత్రంలో చాలా మంచి పాత్ర చేశాడు స‌ప్త‌గిరి. అత‌ని కామిక్ టైమింగ్ నాకు అప్పుడే అర్థ‌మైంది. ఈ సినిమా అత‌నికి ఇంకా మంచి పేరు తెచ్చిపెడుతుంది. మంచి సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మా బ్యాన‌ర్‌లో స‌ప్త‌గిరితో ‘ఎవడిగోల వాడిది 2’ ని చేయాల‌ని అనుకుంటున్నాం స‌ప్త‌గిరితో“ అని చెప్పారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు ప‌లువురు పాల్గొన్నారు.