విజయ దశమి రోజున ‘సప్త స్వర క్రియేషన్స్’ గ్రాండ్ లాంచ్ !

సినిమా ఇండస్ట్రీ లొ 20సంవత్సరాలనుంచీ వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ సెవెన్ ఇయర్స్ నుంచి డి ఓ పి గా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్ విజయ దశమి రోజున ‘సప్త స్వర క్రియేషన్స్’ సంస్థ ను లాంచ్ చేసారు.
ఈ సందర్భంగా సప్త స్వర క్రియేషన్స్ అధినేత వాశిలి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ…”చెడు పై మంచి సాధించిన రోజు దసరా. అమ్మ ఆశీస్సులతో కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్న వేళ.. విజయ దశమి శుభ సందర్భంగా మా బ్యానర్ ను స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా వుంది. ఆడియన్స్ నీ అలరించే యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మంట్స్ తో పాటు యూత్ నీ అట్రాక్ట్ చేసే ప్రేమ కదా చిత్రాలు మరియు ఇంటిల్లి పాది చూసే కుటుంబ కధా చిత్రాలు  నిర్మించాలన్నదే  మా సప్త స్వర క్రియేషన్స్ సంస్థ  సంకల్పం. సంవత్సరానికి 4సినిమాలు నిర్మించాలని కృత నిశ్చయంతో వున్నాము. అలాగే  ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయగల సినిమాలకు రూపకల్పన చేయగల టాలెంట్ వున్న నటీనటులకు టెక్నీషియన్స్ కు అవకాశం కల్పించడం మా ప్రధాన ఉద్దేశ్యం. మా సంస్థ చేపట్టబోయే ప్రాజెక్ట్స్  వివరాలను త్వరలో తెలియ చేస్తాము అని అన్నారు.