`శ్రీ షిరిడి సాయి స‌ప్త స్వ‌రాలు` ఆల్బ‌మ్ విడుద‌ల‌ !

శ్రీ ల‌క్ష్మి నారాయ‌ణ క్రియేష‌న్స్  ప‌తాకంపై  ‘కుంద‌న మ్యూజిక్ అకాడ‌మి’ స‌మ‌ర్ప‌ణ‌లో  ` శ్రీ షిరిడి సాయి స‌ప్త స్వ‌రాలు` ప్రైవేట్ ఆడియో ఆల్బ‌మ్  స‌తీష్ సాలూరి సంగీత సార‌థ్యంలో శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ రూపొందించారు.  తెలుగు హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ ఆల్బ‌మ్ లోని పాట‌లు హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్ లో విడుద‌ల‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు సాలూరి వాసురావు, ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌, ఏవియ‌న్ రావు   సీడీల‌ని ఆవిష్క‌రించారు.
అనంత‌రం సాలూరి వాసురావు మాట్లాడుతూ…“స‌తీష్ ది కూడా సాలూరు కావ‌డంతో నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. మంచి సంస్కారం ఉన్న మ‌నిషి. చాలా వ‌ర‌కు నా ద‌గ్గ‌ర సంగీతం నేర్చుకున్నాడు.  ` శ్రీ షిరిడి సాయి స‌ప్త స్వ‌రాలు` ఆల్బ‌మ్ చేయ‌డం చాలా సంతోషం. మంచి సంగీతం, సాహిత్యం కుదిరింది పాట‌ల‌కు.  హిందీ కి కూడా త‌గిన విధంగా స‌తీష్ బాణీలు చేశాడు. గ‌ర్వంగా నా శిష్యుడు అని చెప్పుకునే స్థాయిలో పాట‌లు కంపోజ్ చేశాడు.  స‌తీష్ సినిమాలు కూడా చేస్తున్నాడ‌ని తెలిసింది. చాలా సంతోషం. భ‌విష్య‌త్ లో మంచి సంగీత ద‌ర్శ‌కుడుగా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత గురు చ‌ర‌ణ్  మాట్లాడుతూ…“సాలూరి వాసూరావు గారి శిష్యుడు స‌తీష్ అని చెప్పుకునే స్తాయిలో పాట‌లు చేశాడు. చ‌క్క‌టి సంగీతం, సాహిత్యం కుదిరాయి. స‌తీష్ భ‌విష్య‌త్ లో మంచి సంగీత ద‌ర్శ‌కుడుగా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా “ అన్నారు.
ఏవియ‌న్ రావు మాట్లాడుతూ…“పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ఈ ఆల్బ‌మ్ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ మాట్లాడుతూ…“స‌తీష్ గారు  స‌మ‌కూర్చిన చ‌క్క‌టి బాణీల‌కు చ‌క్క‌టి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు మా పాట‌ల ర‌చ‌యిత‌లు. మా పాట‌ల‌ను విని మ‌మ్మ‌ల్ని దీవిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.
పాట‌ల ర‌చయిత పూర్ణాచారి మాట్లాడుతూ….“ఇటీవ‌ల ప్రేమ‌మ్ చిత్రానికి రెండు పాట‌లు రాశాను. వాటికి మంచి పేరొచ్చింది. మ‌రికొన్ని పెద్ద సంస్థ‌ల్లో పాట‌లు రాస్తున్నా. ఈ క్రమంలో సాయినాథుని అనుగ్ర‌హంతో ఈ ఆల్బ‌మ్ లో ఐదు పాట‌లు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా.  ఈ అవ‌కాశం క‌ల్పించిన సంగీత ద‌ర్శ‌కుడు స‌తీష్ గారికి, నిర్మాత శ్రీమ‌తి ప‌ల్ల‌వి వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు, మా పాట‌లు అంద‌రూ విని మమ్మ‌ల్ని దీవిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
ఎన్.టి.నాయుడు, శ్యామ్ కొల్లి మాట్లాడుతూ…“ఇందులో పాట‌లు రాసే అవ‌కాశం క‌ల్పించ‌న స‌తీష్ గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
ఇందులోని పాట‌ల‌కు పూర్ణాచారి, ఎన్‌.టి నాయుడు, శ్యామ్ కొల్లి  సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. య‌స్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. శ్రీమ‌తి ప్ర‌జ్ఞ వెంక‌టేష్‌, స‌తీష్ సాలూరి, వెంక‌టేష్ వెంగ‌ళ‌దాస్ మ‌రియు శ్వేత నాయుడు పాట‌ల‌ను ఆల‌పించారు.