‘ఎంతవారలైనా శిక్షార్హులే !’.. అని అంటున్న సీతారెడ్డి

అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్‌ జైన్, సీతారెడ్డి ముఖ్య పాత్రల్లో గురు చిందేపల్లి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారలైనా’. సంహిత, చిన్ని–చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 17న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాణ రంగంలో ఉన్న నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే పిచ్చి. దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌మేట్‌. 2016లో కలిశాం. అతను అప్పటికే దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కథ చెప్పాడు. బాగా నచ్చింది. స్నేహితునికి తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. ఇందులో ఎస్‌.పి. పాత్రను కూడా పోషించాను . నటనలో అనుభవం లేకపోయినా కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నా. సృష్టి ప్రారంభం నుంచి మంచీ, చెడు అనే రెండు మార్గాలున్నాయి. ప్రస్తుత కాలంలో ధనం కోసం దాడులు, హత్యలు జరుగుతున్నాయి.అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ‘ఎంతవారలైనా శిక్షార్హులే’ అనే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌. డబ్బు చుట్టూనే తిరుగుతుంది. చనిపోయే చివరి క్షణం వరకూ మనిషి పడే వేదన ఇందులో ఆసక్తికరంగా చూపించాం. పాటలు, కథ, పాత్రలు హైలైట్‌ అవుతాయి. సుక్కు మంచి బాణీలు ఇచ్చాడు.
ఇందులో ఎస్పీ పాత్ర చేశాను. ఉమేష్‌ చంద్ర, సురేంద్రలాంటి పోలీస్‌ ఆఫీసర్స్, నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావుగారి స్ఫూర్తితో ఈ పాత్ర చేశా. నా పాత్రని రాజశేఖర్, సాయికుమార్‌గార్లతో పోల్చడం ఆనందంగా ఉంది. ఎస్వీ రంగారావు, కమల్‌హాసన్‌గార్లు అభిమానిస్తాను. కమల్‌హాసన్‌ నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని మరోవైపు దృష్టి మళ్ళకుండా ఎలా సాగుతాయే మా సినిమా కూడా అంతే. ఇందులో కథే హీరో.నిర్మాతగా రామానాయుడుగారు, బిజినెస్‌పరంగా ‘దిల్‌’ రాజుగారు నాకు స్ఫూర్తి. అందుకే ఈ చిత్రాన్ని స్వంతంగా రిలీజ్‌ చేస్తున్నా. ఈ చిత్ర ఫలితం పక్కన పెడితే మున్ముందు నటుడిగా, నిర్మాతగా కొనసాగుతా’ అని చెప్పారు.తెలుగులో ఈ సినిమా విడుదలవుతోంది. కన్నడలో కూడా త్వరలోనే ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి