ఒక్క పోస్ట్ కు 25 కోట్లు …లక్షల్లో లైక్ లు !

సెలీనా గోమేజ్‌… ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పెట్టే ఒక్కో పోస్ట్‌కు సెలీనా గోమేజ్‌ ఎంత సంపాదిస్తోందో తెలిస్తే షాకవుతారు.ప్రముఖ అమెరికన్‌ గాయని, నటి సెలీనా గోమేజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ఉంది . ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అత్యధికంగా 141.5 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. సెలీనా పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆమె నుంచి ఒక్క పోస్ట్‌ వచ్చినా లక్షల్లో లైక్‌లు, కామెంట్లు పెడుతుంటారు.
విపరీతమైన పాపులారిటీ ఉన్న సెలీనాకు భారీ పారితోషికం ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి.తాజాగా సెలీనా ప్రముఖ జర్మన్‌ కంపెనీ అయిన ప్యూమాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ బ్రాండ్‌కు సంబంధించి సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్కో పోస్ట్‌కు ఆమె ఎంత సంపాదిస్తోందో తెలిస్తే అవాక్కవుతారు. సెలీనా పెట్టే ఒక్కో పోస్ట్‌కు 3.5 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.24 కోట్ల 75 లక్షలు. ‘ప్యూమా’ బ్రాండ్‌కు చెందిన దుస్తులు, షూస్‌ వేసుకుని సెలీనా దిగిన ఫొటోలకు లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి.
అయితే ‘ప్యూమా’ నుంచి సెలీనా తీసుకునే పారితోషికంలో కొంతభాగం ఓ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు విరాళంగా ఇస్తోంది. రెండేళ్ల క్రితం సెలీనాకు ల్యూపస్‌ వ్యాధి సోకింది. తనలా ఈ వ్యాధితో ఇంకెవరూ బాధపడకూడదని,మంచి మందులు  తయారుచేసేందుకు పరిశోధనలు చేస్తున్న సంస్థలకు సెలీనా విరాళాలు ఇస్తోంది. ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పుడు సెలీనా స్నేహితురాలు, హాలీవుడ్‌ నటి ఫ్రాన్సియా రైజా ఒక కిడ్నీని స్నేహితురాలికి ఇచ్చారు. స్నేహానికి ప్రతిరూపంగా నిలిచారు.