యాభై ఏళ్ల వయసులో శోభన పెళ్లి

వివిధ భాషలతో పాటు తెలుగులో అభినందన, అల్లుడుగారు, రుద్రవీణ, ఏప్రిల్ ఒకటి విడుదల  వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయికగా నటించింది శోభన. తమిళం, హిందీ, మలయాళ భాషల్లో తన నటనప్రతిభతో రాణించింది. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 200కు పైగా చిత్రాల్లో నటించిన శోభన భరతనాట్య కళాకారిణిగా చక్కటి పేరుప్రఖ్యాతుల్ని దక్కించుకున్నది. 2013లో మలయాళ భాషలో రూపొందిన ‘థిర’ తర్వాత వెండితెరకు దూరమైన ఆమె త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది.

తనకు అత్యంత ఆప్తుడైన ఓ స్నేహితుడిని ఆమె పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శోభన కుటుంబంతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్తల పై శోభన ఇప్పటివరకు సమాధానమివ్వలేదు. 47 ఏళ్ల వయసులో శోభన పెళ్లికి సిద్ధపడటం దక్షిణాది చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘నృత్యానికే తన తొలి ప్రాధాన్యత’ అని పలు సందర్భాల్లో శోభన పేర్కొంది. 2001లో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న ఆమె అనంత నారాయణి అనే పేరు పెట్టింది.