సీనియర్ నటుడు శశికపూర్ కన్నుమూశారు !

బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోకిలాబెన్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1941 నుంచి 1999 పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో నటించిన శశికపూర్ 1938, మార్చి 18న కోల్‌కతాలో జన్మించారు. ‘ఆగ్‌’ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. శశికపూర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ధర్మపుత్ర’. మొత్తం 116 సినిమాలు చేసిన శశికపూర్ 61 చిత్రాల్లో హీరోగా నటించారు. కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్‌ ఆస్మాన్‌ లాంటి సూపర్ హిట్‌ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. బిగ్ బి అమితాబ్‌తో కలిసి శశికపూర్‌ దివార్‌, నమక్‌ హలాల్‌ చిత్రాల్లో నటించారు. ఇందులో దివార్‌ చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. శశికపూర్ సినీరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు దక్కాయి. బాలీవుడ్ తొలితరం నటుడు పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు శశికపూర్. నాలుగేళ్ల వయసు నుంచే  శశికపూర్ నట ప్రస్థానం మొదలైంది. 1999లో చివరి సారిగా ‘సైడ్ స్ట్రీట్స్’ అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. శశికపూర్‌కు ముగ్గురు సంతానం. కరణ్ కపూర్, కునాల్ కపూర్, సంజనా కపూర్