లవ్ ఫెయిల్యూర్స్ తర్వాత రైట్ పర్సన్‌ని ఎంచుకున్నా!

‘జెమినీ’ లో  వెంకటేష్ సరసన  హీరోయిన్ గా చేసిన  నమిత కోలీవుడ్ లో చాలా పాపులర్ అయ్యింది. నమిత పెళ్ళి గతవారం అయిపోయింది. కొంత కాలంగా సినిమా ఛాన్సులు లేక, కోరుకున్న రాజకీయ రంగం కలిసిరాక పెళ్ళి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా మంచి పాత్రలు లభిస్తే నమిత నటిస్తుందని ఆమె భర్త వీరేశ్ చౌదరి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నమిత ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు…..
పెళ్లి తర్వాత మెట్టెలు, మంగళసూత్రం మినహా తన జీవితంలో మార్పేమీ లేదన్నారు.తన ప్రేమ వ్యవహారాల విషయమై మాట్లాడుతూ.. తనకు మూడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని.. కాబట్టి రైట్ పర్సన్‌ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందన్నారు. తనను వీర్ పెళ్లి చేసుకుంటానన్నాడని.. ఆయన్ని కాదనడానికి కూడా కారణాలేమీ కనిపించలేదన్నారు. ఒకవేళ వీర్ ప్రపోజ్ చేయకపోయి ఉంటే నేనే  ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగి ఉండేదాన్నని నమిత చెప్పుకొచ్చారు.