సన్నీ లియోన్ ‘తల్లి’ అయ్యింది !

సెక్సీ స్టార్ సన్నీ లియోన్ ప్రెగ్నెంట్ అనే రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలను ఖండించారు సన్నీ దంపతులు. ఇంతలోనే సన్నీ లియోన్ ‘తల్లి’ అయ్యారు. అయితే ఆమె తల్లయింది పాపకు జన్మనిచ్చి కాదు… ఒక పాపను దత్తత తీసుకుని ఆమె ‘అమ్మ’అయ్యింది. ఆ చిన్నారి నవ్వులు ఇప్పుడు తమ జీవితంలోకి కొత్త ఆనందాన్ని తీసుకొచ్చాయని సన్నీలియోన్ దంపతులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల చిన్నారిని సన్నీ-వెబర్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. చిన్నారికి అటు సన్నీ.. ఇటు ఆమె భర్త పేరు కలిసి వచ్చేలా  నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. ఇది వరకూ కొంతమంది హాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు కూడా దత్తత పిల్లలతో ‘అమ్మ’లైన సంగతి తెలిసిందే.