ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంది !

షారుఖ్‌ ఖాన్‌… అతనిలో ఇప్పటికీ ఓ కల నిండిపోయి ఉందట. చిన్నతనంలో ఓ విషయంలో కుంగిపోవడం వల్ల ఆ కలను అప్పట్లో నెరవేర్చుకోలేకపోయాడట….” నేను పెద్ద ఆటగాడ్ని కావాలని చిన్నప్పుడు కలలు కంటూ ఉండేవాడ్ని. ఎంతలా అంటే భారతదేశం తరఫున ఏదో ఆటకు నేను ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలని అనుకునేవాడ్ని. అందుకే హాకీ, ఫుట్బాల్‌, క్రికెట్‌, అథ్లెటిక్‌ నిరంతరం ఆడేవాడ్ని. ఆ ఆటల్లో పెద్ద ప్రావీణ్యం సంపాదించలేదుగానీ, బాగా ఆడటానికి ప్రయత్నించేవాడ్ని” అని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ అన్నారు. ‘ఆసియన్‌ పారా గేమ్స్‌ -2018’ దివ్యాంగుల వీడ్కోలు సభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ అదే కల అతనిలో నిండిపోయి ఉందట. చిన్నతనంలో ఓ విషయంలో కుంగిపోవడం వల్ల ఆ కలను అప్పట్లో నెరవేర్చుకోలేకపోయాడట.
విషయం ఎవరీ తెలియదు. ఇప్పుడు మీకు చెబుతున్నా. ఇక్కడకు రావడానికి కూడా నా స్వార్థమే ఉంది. నేను మీకోసం ఇక్కడకి రాలేదు. నా కోసమే నేను వచ్చాను. ఏడాది పాటు నేను కుంగుబాటుకు గురయ్యాను. మా తల్లిదండ్రులు స్పోర్ట్స్‌కు వెళతానంటే ప్రోత్సహించకపోవడమే దానికి కారణం. ఆ ఏడాది గడిచిపోయింది… అంతే వయసు కూడా దాటిపోయింది. ‘ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంద’ని అప్పుడు నాకు బోధపడింది. తర్వాత నా తల్లిదండ్రులు, భగవంతుడి దీవెన, కోట్లాది ప్రజల ప్రోత్సాహంతో నటనా రంగంలో గొప్పగా నిలుదొక్కుకున్నా” అని షారుఖ్‌ ఖాన్‌ తెలిపారు.
నం ఎంచుకున్న మార్గాల్లోగానీ, మరొక దాని విషయంలో గానీ సంపూర్ణంగా ఉండమన్న విషయాన్ని తాను నమ్ముతానని చెప్పారు. కానీ అలా అసంపూర్తిగా ఉన్నవే మనకు అవకాశాలను తెచ్చిపెడతాయని.. అదే మనకు జీవితాన్ని బోధిస్తుందని షారుఖ్‌ చెప్పారు. ఆటలను జీవితంగా ఎంపిక చేసుకున్న వారికి తాను అభివందనం చేస్తున్నానని, ఈ రంగం తమ అసాధ్యాలను, అభద్రతను, బలహీనతలు వంటి వాటిని అధిగమించి జీవిత లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆటల ప్రాముఖ్యత తెలుసుకోవాలని వివరిస్తారని, ‘జీవితంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేద’ని తన పిల్లలకు నిత్యం చెబుతూ ఉంటానని షారుఖ్‌ చెప్పారు.