అర్ధంపర్ధంలేని సినిమాలు చెయ్యను !

షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రం విడుదలై సుమారుగా 10 నెలలు పైనే అయింది. ఏవో కొన్ని చిత్రాలకు నిర్మాతగా తప్ప.. షారుఖ్‌ హీరోగా ఏ చిత్రమూ చేయడం లేదు. తాజాగా ఓ సినిమా చేస్తానని చెప్పారు .తన జన్మదినాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ.. షారుఖ్‌ సినిమా జీవితం గురించే మాట్లాడారు తప్ప… కొత్తగా చేయబోయే ప్రాజెక్టులు గురించి ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ” ఆరోగ్యంగా ఉండేందుకు, హార్డ్‌వర్క్‌ చేసేందుకు ప్రయత్నిస్తా. నేను నాకోసం పని చేయను. ఆత్మగౌరవం, సంతోషం, దయ, ప్రేమ ఇవ్వమని కోరుతా. నేను అన్ని రకాల చిత్రాలూ చేస్తా. అందులో హాస్యం, రొమాన్స్‌, డ్రామా, డాన్స్‌ అన్నీ ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ సినిమా చేయడానికి ప్రయత్నిస్తా. దాని వల్ల నాక్కూడా ఆనందం కలుగుతుంది” అని అన్నారు.
 
“చాలా ఏళ్ల తర్వాత ఇండిస్టీలో మిగిలిన నటీనటులు చేసే సినిమాలను చూసే అవకాశం దక్కింది. దాని వల్ల ఆ నటీనటుల నుంచి స్ఫూర్తి పొందాను. ప్రజల నుంచి ఇంతటి అద్భుతమైన ప్రేమ పొందడానికి కారణమేమిటో? ఇప్పటికీ అర్థంకాని విషయంగానే మిగిలి ఉంది. మీరంతా నా ఇంటిబయట వరకూ వస్తున్నారు కానీ హాల్‌లోకి రావడం లేదు. ఇక నుంచి హాల్లోకి రావడం ప్రారంభించండి’ అని చెప్పారు షారుఖ్‌.
 
షారుఖ్‌ తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ… ‘ నా కొత్త చిత్రం గురించి ప్రకటిస్తానని మీడియా ప్రచారం చేసింది. ఆ విషయం నేను ప్రకటించినప్పుడు నా పుట్టినరోజుగా జరుపుకోండి. నేనూ అలాగే సెలబ్రేట్‌ చేసుకుంటా. ఎందుకంటే నా సినిమా బాగుంటేనే మీరంతా సంతోషంగా ఉంటారు. అర్థపర్థం లేని చిత్రాలు చేయను. అందుకే మంచి కథల కోసం ప్రయత్నిస్తున్నా’ అని చెప్పారు.
అట్లీతో షారూక్ ఖాన్ మూడు సినిమాలు
త‌దుప‌రి సినిమాకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్.. ఇప్పుడు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్ ఖాన్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. నయనతారతో `రాజా రాణి` త‌ర్వాత విజ‌య్‌తో`తెరి`,`మెర్స‌ల్‌, రీసెంట్‌గా`విజిల్‌`సినిమాలు చేసిన అట్లీ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్నాడు.అయితే తాజా స‌మాచారం మేర‌కు అట్లీతో షారూక్ ఖాన్ త‌న బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు చేయాల‌నే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడ‌ట‌.
బుర్జ్ ఖలీఫాపై షారూక్ ‘హ్యాపీ బర్త్ డే’
షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై ఆయన పేరునుషారూక్ ఖాన్ హ్యాపీ బర్త్ డే ప్రదర్శించారు. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ షారూక్ ఖాన్ హ్యాపీ బర్త్ డే’ అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగానే ఆయన అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందిన ఈ భవంతిపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి. షారుక్ 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తన పేరును ఎంతో ప్రకాశవంతంగా కనిపించేలా చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, దుబాయ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నార’ని షారుక్ ట్వీట్ చేశారు.